దీనితో పాటు మరోవైపు క్రిష్ దర్శకత్వంలో ఒక భారీ పీరియాడికల్ డ్రామా మూవీ, అలానే అయ్యప్పనుం కోషియం మూవీ తెలుగు రీమేక్ లో కూడా పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అందుతున్న సమాచారాన్ని బట్టి వకీల్ సాబ్ వేసవి కానుకగా ఏప్రిల్ లో రిలీజ్ కానుండగా అయ్యప్పనుం కోషియం రీమేక్ మూవీ ఆగష్టు లో అలానే క్రిష్ మూవీ జనవరి లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక వీటి తరువాత ఇప్పటికే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కూడా ఒక సినిమా చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా వీటితో పాటు మరొక్కసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా పవన్ ఒక సినిమా చేయనున్నారు అంటూ ఇటీవల కొద్దిరోజులుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి.
అయితే ప్రస్తుతం అయ్యప్పనుం కోషియం మూవీ కి స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్న త్రివిక్రమ్ మరోవైపు ఎన్టీఆర్ మూవీ పనుల్లో కూడా పూర్తిగా నిమగ్నమై ఉన్నారని, అందుకని పవన్ తో తాను తీయబోయే సినిమాని కొన్నాళ్ల పాటు ప్రక్కన పెట్టిన త్రివిక్రమ్, వచ్చే ఏడాది దానిని తెరకెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇటీవల ఆ మూవీ కథ విన్న పవన్, అది ఎంతో నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పారని, కానీ ప్రస్తుత కమిట్మెంట్స్ రీత్యా బిజీగా ఉండడంతో కొంత సమయం అడిగారట త్రివిక్రమ్....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి