అయితే ఈ సినిమా క్లైమాక్స్ కి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం ఓ రేంజ్ లో హల్ చల్ అవుతుంది.అదేంటంటే తన కూతురిని ప్రేమిస్తున్నాడనే కోపంతో విలన్.. హీరో పురుషాంగాన్ని కత్తిరిస్తాడని అందరూ చెప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని నేరుగా చెప్పకపోయినా.. మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రీరిలీజ్ ఈవెంట్ లో పరోక్షంగా చెప్పటం జరిగింది.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న హీరో వైష్ణవ్ తేజ్ స్వయంగా క్లైమాక్స్ ఎపిసోడ్ పై స్పందించారు. క్లైమాక్స్ గురించి సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోందని.. కానీ అందులో పూర్తి నిజం లేదని అన్నారు. సినిమా చూస్తే అందరికీ అర్ధమవుతుందని చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు క్లైమాక్స్ గురించి తప్పుడు ప్రచారం జరుగుతుందని.. కొంతమంది దీనిని ఫన్నీగా చూస్తున్నారని.. కానీ సినిమా చూసిన తరువాత ఆ సన్నివేశంలో లోతు, అంతరార్ధం తెలుస్తుందని అన్నాడు.
అంతేకాదు.. ఆ సీన్ దగ్గరే ‘ఉప్పెన’ అనే టైటిల్ జస్టిఫికేషన్ ఉంటుందని కామెంట్స్ చేశాడు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి