రెబల్ స్టార్
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా
సినిమా రాధేశ్యామ్ పై అందరిలో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ
మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్, మోషన్
పోస్టర్ కి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో పాటు అవి సినిమాపై అంచనాలు మరింతగా పెంచాయి.
పూజ హెగ్డే తొలిసారిగా
ప్రభాస్ కి జోడీగా నటిస్తున్న ఈ సినిమాకి
రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ ని మనోజ్ పరమహంస ఫొటోగ్రఫీని అందిస్తున్నారు.
మంచి రిట్రో
లవ్ స్టోరీ గా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో
ప్రభాస్ కు తల్లిగా
బాలీవుడ్ సీనియర్ నటి
భాగ్యశ్రీ నటిస్తుండగా సీనియర్
రెబల్ స్టార్ కృష్ణంరాజు ఒక కీలక పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. జయరాం, షాషా ఛత్రి,
ప్రియదర్శి తదితరులు ఇతర పాత్రలు చేస్తున్న ఈ
సినిమా ఈ ఏడాది జులై 30న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇక
ప్రభాస్ కూడా ఈ సినిమాలోని తన పాత్ర కోసం ఎంతో కష్టపడ్డారని, అతి త్వరలో
సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని, అలానే రాబోయే మరికొద్దిరోజుల్లో
మూవీ నుండి తొలి సాంగ్ రిలీజ్ అవుతుందని అంటున్నారు.
ఇక లేటెస్ట్ గా కొన్ని ఫిలిం
నగర్ వర్గాల నుండి మా
ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్
హీరోయిన్ క్యారెక్టర్ అని అంటున్నారు. సినిమాని ఆమె పాత్ర ఇంటర్వెల్ తరువాత ఒక కీలక మలుపు త్రిప్పుతుందని, అటువంటి పాత్రని
హీరోయిన్ పూజా హెగ్డే ఎంతో చక్కగా పోషించిందని అంటున్నారు. రేపు రిలీజ్ తరువాత
మూవీ తప్పకుండా భారీ
సక్సెస్ అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి
సాహో తరువాత చాలా గ్యాప్ అనంతరం వస్తున్న ఈ రాధేశ్యామ్
మూవీ ప్రభాస్ కి ఏ రేంజ్
సక్సెస్ ని అందిస్తుందో చూడాలి...!!