రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారనే విషయం మనకు తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం.. రామ్ చరణ్ మరొక పాత్రలో కూడా కనిపించనున్నారని తెలుస్తోంది. బ్రిటిష్ వారి కోసం పనిచేసే ఒక పోలీస్ ఆఫీసర్ గా రామ్ చరణ్ కనిపించి కేకపుట్టించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ ప్రచారంలో నిజమెంతో తెలియదు కానీ రామ్ చరణ్ అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.


ధ్రువ సినిమాలో పోలీస్ అవతారంలో కనిపించి ఫిదా చేసిన చెర్రీ మళ్లీ ఆర్ఆర్ఆర్ లో కూడా పోలీసు అవతారంలో కనిపించనున్నారనే వార్త అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది. అయితే సినిమా చివరిలో రామ్ చరణ్ తన రెండు కాళ్ళు పోగొట్టుకుంటారని.. జూనియర్ ఎన్టీఆర్ కళ్ళు పోతాయని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా రాజమౌళి ప్లాన్ చేశారని కొందరు చెబుతున్నారు. ఈ సినిమా లో కొమరంభీం గాని అల్లూరి సీతారామరాజు గానీ చనిపోరని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. కానీ సినిమా చివరిలో మాత్రం ఇద్దరూ కూడా తమ అవయవాలు కోల్పోతారని టాక్ నడుస్తోంది.


ఇకపోతే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర కోసం నిర్విరామంగా కష్టపడి బ్రహ్మాండమైన ఫిట్ నెస్ సంపాదించారు. ఆయన పాత్రకు సంబంధించిన ఇంట్రో టీజర్ కట్ విడుదలై మంచి రెస్పాన్స్ పొందింది. జూనియర్ ఎన్టీఆర్ పోషిస్తున్న కొమరం భీమ్ పాత్రకు సంబంధించిన టీజర్ కూడా విడుదలయ్యి నాలుగు కోట్ల వ్యూస్ సంపాదించి చరిత్ర సృష్టించింది. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై భారత దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 13వ తేదీన దసరా పండుగ సందర్భంగా విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ చిత్రం బాహుబలి స్థాయిలో హిట్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: