తమ ప్రొడక్ట్స్ సేల్స్ పెoచుకోవడానికి చిన్న కంపెనీల నుండి అంతర్జాతీయ కంపెనీల వరకు ప్రతిరోజు జరిగే సంఘటనలను ఉపయోగించుకుంటూ కొత్తకొత్త ఆలోచనలతో యాడ్స్ విడుదల చేస్తూ తమ సేల్స్ పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ ప్రయత్నాలలో కొన్ని వికటించి విమర్శకుల దాడులకు టార్గెట్ అవుతున్నాయి.

అలాంటి సందర్భమే 3 రోజుల క్రితం జరిగింది  ఫాదర్స్ డే సందర్భంగా న్యూస్ పేపర్లలో ప్రముఖ లోదుస్తుల కంపెనీకి సంబంధించి ప్రచురితమైన యాడ్ వివాదాస్పదం అయింది. ఈ యాడ్ మహిళలు ధరించే బ్రా ఇతర లోదుస్తులకు సంబంధించింది. ఈ యాడ్ ను ప్రముఖ అండర్ గార్మెంట్స్ కంపెనీ ‘TRIUMP’ విడుదల చేసింది.

1886లో స్థాపించిన ఈ అంతర్జాతీయ కంపెనీ జూన్ 21న ఫాదర్స్ డే సందర్భంగా ‘తమ తండ్రులచే గారాబం చేయబడే అమ్మాయిల కోసం 15% సేవింగ్స్. జూన్ 21న ‘ఫాదర్స్ డే’నాడు మాత్రమే ఈ ఆఫర్' అంటూ చాల విచిత్రమైన ప్రకటనలు గుప్పించింది. ఈ ప్రకటనల పై మహిళా సంఘాలు ఇప్పటికే ఈ కంపెనీని టార్గెట్ చేస్తున్నాయి. 

వీరికి మద్దతుగా కన్నడ బ్యూటీ ‘ముకుంద’ సినిమా ఫేం పూజా హెగ్డే రంగంలోకిదిగి ఆ కంపెనీ పై నిప్పులు చెరగడమే కాకుండా ఉద్యమం చేస్తున్న మహిళా సంఘాలకు తన మద్ధతు తెలియచేసింది. ఆమె మాటలకు బాలీవుడ్ స్టార్ ఫర్హాన్ అక్తర్, నటుడు రిషి కపూర్ లాంటి మరికొందరు కూడ మద్ధతు తెలియచేసారు. పూజా ప్రస్తుతం బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో నటిస్తున్న సినిమా విడుదల కాకుండానే ఈ ‘బ్రా’ యాడ్ వ్యవహారంలో తన కామెంట్స్ వినిపించడంతో బాలీవుడ్ మీడియాకు హాట్ న్యూస్ గా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: