అయితే కెరీర్ తొలినాళ్లలో అజిత్ ఎన్నో ప్రేమకథా చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. తెలుగులోకి డబ్ అయిన ‘ప్రేమలేఖ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు అజిత్ నటించిన అన్ని సినిమాలో తెలుగులోకూడా డబ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి.
ఇక ఇటీవల హైదరాబాద్ రోడ్లపై సైకిలింగ్ చేస్తూ కనిపించాడు అజిత్. అజిత్ కు హైదరాబాద్‌తో ఎంతో అనుబంధం ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అజిత్ హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాడు. హీరో కాకముందు హైదరాబాద్ లోనే బైక్ మెకానిక్ గా పనిచేశాడు. తనకు వీలు దొరికినప్పుడల్లా హైదరాబాద్‌కు వచ్చి వెళ్తుంటాడు.
స్టార్ హీరోగా స్వయంకృషి ఎదిగిన అజిత్ ను అభిమానులు ముద్దుగా ‘మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ’అని పిలుస్తుంటారు. తాజాగా మరోసారి త సింప్లిసిటీతో అభిమానుల మనసు గెలుచుకున్నాడు అజిత్. అజిత్ ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖరీదైన కార్లలో కాకుండా ఇలా ఆటోలో తిరుగుతూ అజిత్ కనిపించరు.
అయితే అజిత్ ప్రస్తుతం ‘వాలిమై’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగనుందని తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఈ సినిమా చాలా వరకు చిత్రీకరణ జరుపుకుంది.ఆ తర్వాత స్పెయిన్ లో షూట్ చేస్తున్నారు. తెలుగు యంగ్ హీరో కార్తికేయ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్ లో కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి