
“నీటి నీటి సుక్కా .. నీలాల సుక్కా నిలబాడి కురవాలి నీరెండయేలా ..” అంటూ సాగే ఈ పాట శ్రోతలను అలరిస్తుంది. కల్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించిన ఈ పాటను మోహన భోగరాజు అద్భుతంగా ఆలపించారు. ముఖ్యంగా ఈ పాటలోని చరణాలు చాలా అర్ధవంతంగా ఉన్నాయి. “నీరెండలో వాన కురిసినప్పుడు గడ్డిపోచలపై పడిన వాన చినుకులు నీలాల మాదిరిగా మెరుస్తూ మెత్తగా జారుతుంటాయి అనే భావన బాగుంది. మాగాణి దున్నేటి మొనగాడు ఎవరే .. గరిగోళ్ల పిలగాడే ఘనమైనవాడే ..” అనే చరణం ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకి యస్ యస్ తమన్ సంగీతం అందించాడు.ఇక సినిమాను ఏప్రిల్ 23వ తేదీన విడుదల చేయనున్నారు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...