పవన్ కళ్యాణ్ శృతి హాసన్ ల కలయికలో తెరకెక్కతున్న లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్. తొలిసారిగా పవన్ తో కలిసి ఆయన అభిమాని అయిన వేణు శ్రీరామ్ తీస్తున్న ఈ మూవీని దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి ఎంతో భారీ వ్యయంతో అత్యున్నతంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అంజలి, ప్రకాష్ రాజ్, నివేదా థామస్, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర పాత్రలు చేసారు. యువ మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీకి పీఎస్ వినోద్ ఫోటోగ్రఫి అందించారు.

పవర్ స్టార్ నుండి దాదాపుగా మూడు సంవత్సరాల తరువాత వస్తున్న మూవీ కావడంతో వకీల్ సాబ్ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్స్, సాంగ్స్ అన్ని కూడా ఇప్పటివరకు మూవీ పై ఉన్న అంచనాలు మరింతగా పెంచేసాయి. అయితే నేడు కొద్దిసేపటి క్రితం ఈ మూవీ ట్రైలర్ ని యూనిట్ రిలీజ్ చేసింది. పవర్ స్టార్ వకీల్ సాబ్ గా ఈ ట్రైలర్ లో అదరగొట్టారు అని చెప్పాలి. ఇక ట్రైలర్ ని బట్టి చూస్తే ఈ మూవీ మంచి యాక్షన్, ఎమోషన్స్ తో కూడిన కోర్ట్ డ్రామా మూవీగా తెరకెక్కుతున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఒరిజినల్ బాలీవుడ్ మూవీ పింక్ యొక్క అసలు కథని దర్శకుడు వేణు శ్రీరామ్ మన తెలుగు వారికి తగ్గట్లు కొంత మార్పు చేసినట్లు ట్రైలర్ ని బట్టి చూస్తే మనకు అర్ధం అవుతుంది. 

ముఖ్యంగా ట్రైలర్ లో లాయర్లుగా పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ ఇద్దరూ ఎంతో అద్భుతంగా డైలాగ్స్ చెప్పగా, థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, వినోద్ విజువల్స్ మరింతగా ట్రైలర్ కి వన్నె తెచ్చాయి. మొత్తంగా చెప్పాలంటే పవర్ ప్యాక్డ్ గా సాగిన ఈ వకీల్ సాబ్ మూవీ ట్రైలర్ ని బట్టి చూస్తుంటే ఏప్రిల్ 9 న రిలీజ్ కాబోయే మూవీ తప్పకుండా సక్సెస్ అయ్యే ఛాన్స్ కనబడుతోందని విశ్లేషకులు అంటుంటే, షూర్ షాట్ గా తమ పవర్ స్టార్ ఈ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంటారని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: