రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న విరాట పర్వం చిత్రాన్ని వేణు ఉడుగుల డైరెక్ట్ చేస్తున్నారు. ఐతే మంగళవారం నాడు తెలుగు నూతన సంవత్సరాది అయిన ఉగాది సందర్భంగా విరాటపర్వం మూవీ యూనిట్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేసింది.


ఈ పోస్టర్‌లో హీరోయిన్ సాయి పల్లవి బ్లాక్ & లావెండర్(తులసి రంగు) కలర్ హాఫ్ చీరలో పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయిలా చాలా అందంగా కనిపించారు. ఆమె పెదాలపై నవ్వు ఈ పోస్టర్ కి మరింత అందాన్ని తెచ్చిపెట్టింది. ఈ పోస్టర్ లో సాయి పల్లవి.. మామిడి తోరణాలు కట్టిన ఒక గడపకు పసుపు రాయడం మనం చూడొచ్చు. పండుగల సమయంలో ఇలా గడపలకు పసుపు రాయడం మన తెలుగు వారికి అనాదిగా వస్తున్న సాంప్రదాయం. అయితే తెలుగు సంస్కృతికి అద్దంపట్టేలా సాయి పల్లవి ఉగాది పోస్టర్ ఉండడంతో అందరినీ ఆకట్టుకుంటోంది.




ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా.. "శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు," అని తెలుపుతూ సాయిపల్లవి పోస్టర్ ను విడుదల చేసింది. ఇదే పోస్టర్ ని హీరో దగ్గుబాటి రానా కూడా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.




ఈ పిరియాడికల్ డ్రామాలో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, ఈశ్వరి రావు వంటి ప్రతిభావంతులైన నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 1990 కాలానికి సంబంధించిన నక్సలైట్ల ఉద్యమం నేపథ్యంలో విరాటపర్వం సినిమాని డైరెక్టర్ వేణు రూపొందించారు. ఈ సినిమాలోని రానా అరణ్య అనే ఒక విప్లవాత్మక కవి గా కనిపించనున్నారు. ఆయన నక్సలైట్ పాత్రలో కూడా నటించారు. అయితే అరణ్య రాసిన విప్లవాత్మక పద్యాలను చదివి అతడిని వెన్నెల( సాయి పల్లవి) ప్రేమించడం ప్రారంభిస్తారు.



సురేష్ ప్రొడక్షన్స్, శ్రీలక్ష్మీవెంకటేశ్వర బ్యానర్స్ పై డి.సురేష్ బాబు తో పాటు సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలై సినిమాపై భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసింది. కోలు కోలు సాంగ్ కూడా చాలా మధురంగా ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో చేరుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: