పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఐదు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాని ఆగస్ట్ 13న విడుదల చేయనున్నారు. అయితే దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో అల్లుఅర్జున్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇటీవల దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది. కానీ అతి త్వరలో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఒక భారీ పాన్ ఇండియా సినిమా రాబోతున్నట్లుగా ఐదు రోజుల క్రితం అధికారికంగా న్యూస్ బయటకు రావడం జరిగింది. దానితో అల్లుఅర్జున్, కొరటాల మూవీ వాయిదా పడినట్లు తెలుస్తోంది.
అసలు విషయం ఏమిటంటే కొరటాల మూవీ వాయిదా పడిన అనంతరం గతంలో దిల్ రాజు, వేణు శ్రీరామ్ లతో అల్లు అర్జున్ చేయాల్సిన ఐకాన్ సినిమా ప్రస్తుతం తెరపైకి వచ్చింది. దానితో తన తదుపరి సినిమాని వేణు శ్రీరామ్ తోనే అల్లు అర్జున్ చేయనున్నారు అనే వార్త రెండు రోజుల నుంచి ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది/ మరోవైపు పలువురు ఇతర స్టార్ డైరెక్టర్లు అల్లుఅర్జున్ ఇంటికి వచ్చి వెళుతున్నారని అలానే వారి నుండి ఆయన కథలు కూడా వింటున్నారని సమాచారం. మొత్తంగా దీన్ని బట్టి చూస్తుంటే ప్రస్తుతం బంతి అల్లు అర్జున్ కోర్టులో ఉందని ఆయన తదుపరి సినిమా ఎవరితో చేస్తారు అనేది క్లారిటీ రావాలంటే అధికారికంగా న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి