తెలుగు, హిందీ రెండు బాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. విచక్షణ మరియు యోగ్యత లేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం అనే కౌటిల్యుడు అర్థశాస్త్రంలోని కాన్సెప్ట్ ను జతచేసి బ్లాక్ రోజ్ ను నిర్మిస్తున్నట్లు తెలియజేశారు సంపత్ నంది. ఈ మధ్య ఈ సినిమాకి సంభందించిన పోస్టర్ కూడా విడుదల చేసింది చిత్రబృందం. ఇందుకు మంచి రెస్పాన్స్ కూడా దక్కడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఏమైందో ఏమో గానీ కొన్ని రోజులుగాఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ లేదు. సంపత్ కూడా ఈ చిత్రం తదుపరి విషయాల గురించి చడీచప్పుడూ చేయకుండా ఉన్నారు.
దీంతో ఈ సినిమా ఆగిపోయిందన్న ప్రచారం మొదలయ్యింది. అటు నిర్మాత ఇటు దర్శకుడు ఈ సినిమా గురించి స్పందించకపోవడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది . పలు కారణాల వల్ల ఈ చిత్రం ఆగిపోయిందని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరి తమ అభిమాన అందాల తార ఊర్వశి ని తెలుగు తెరపై లీడ్ రోల్ లో చూసే చాన్స్ మిస్ అయినట్లేనా అంటూ ఫీల్ అవుతున్నారు ఆమె అభిమానులు. ఒకవేళ కరోనా వైరస్ కారణంగా తదుపరి పనులు జరగడం లేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. మరి అసలు విషయం తెలియాలంటే చిత్ర బృందంలోని ఎవరో ఒకరు స్పందిచాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి