నరేష్ అంటే తెలియని వారు ఉండరు.ఒకప్పుడు కామెడీ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మంచి గుర్తింపును కూడా తెచ్చుకున్నాడు. ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటిస్తున్నాడు.ఏ సినిమా చూసినా ఆయనే కనిపిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అయిపోయారు.అయితే నిజానికి నరేష్ ను డాక్టర్ చేయాలని ఆయన తల్లి విజయనిర్మల అనుకున్నారు. కానీ నరేష్ కి మాత్రం నటన మీద ఇంట్రెస్ట్ పెంచుకొని ఆర్టిస్ట్‌గా మారాడు.అలాగే నరేష్ తన చిన్నతనంలో తనకంటే నాలుగు ఏళ్ళు పెద్దది అయిన అమ్మాయి తనకి ప్రొపోజ్ చేసిన ఒక ఆసక్తికర సంఘటనను ఓ ఇంటర్వ్యూ సందర్భంగా స్వయంగా వెల్లడించారు.

మరి నరేష్ జీవితంలో జరిగిన ఆ సంఘటన గురించి ఒకసారి తెలుసుకుందామా. !నరేష్ చెన్నై ట్రిప్లికేన్‌లోని హిందూ హైస్కూల్లో చదువుకుంటున్న ప్పుడు జరిగిన సంఘటన అది. నరేష్ ఎనిమిదో తరగతి చదువుతున్న రోజులవి. అయితే అప్పుడు నరేష్ తో పాటు ఒక అమ్మాయి ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. చదువతోందట.వారిద్దరూ కలిసి ఒకే మాస్టారు దగ్గర ప్రైవేట్ చదివేవాళ్లట. అయితే ఒకసారి ప్రైవేట్ జరుగుతూ ఉండగా నరేష్  మేస్టారు కాఫీ కోసం హోటల్‌కు వెళ్లారట . ఆయన అటు వెళ్లగానే ఆ అమ్మాయి ఓ పేపర్ చేతిలో పెట్టి 'ఐ లవ్ యూ..'అని నరేష్ కి చెప్పేసిందట.ఇంకేముంది నరేష్ గుండె దడదడలాడిపోయిందట.ఒంటి నిండా చెమటలు పట్టేశాయని  ఆయన గుర్తు చేసుకున్నారు.


అమ్మాయి అలా చెప్పడంతో ఏమి చేయాలో తెలియక వెంటనే హోటల్ దగ్గరున్న మేస్టారు దగ్గరకు వెళ్లిపోయానని నరేశ్ చెప్పారు. "ఆయన నరేష్ ను చూసి 'ఏరా?'ఏంటి ఇలా వచ్చావ్ అన్నారట. 'లెక్కలు అర్థం కావటం లేదు' అని చెప్పడంతో 'సరే రా కాఫీ తాగు' అన్నారు. కాఫీ తాగి ఆయనతో తిరిగివస్తున్న నరేష్ ను చూసి ఆ అమ్మాయి మొహంలో భయం వేసిందట. చెప్పేశావా?'మాష్టారుకి అనే ఎక్సప్రెషన్ పెట్టిందట. చెప్పలేదు అని అన్నట్లు నరేష్ సైగచేసి చెప్పాడట.ఆ మరుసటి రోజు నరేష్ ని పిలిచి 'ఛీ ఛీ చిన్నపిల్లల్ని ఎప్పుడూ ప్రేమించకూడదు'ప్రేమిస్తే ఇలానే ఉంటుంది అని ఎడాపెడా చీవాట్లు పెట్టి వెళ్లిపోయిందని తెలిపారు నరేశ్‌.ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా తాము ఇద్దరం ఫ్రెండ్స్‌లా ఉంటూవచ్చామనీ వెల్లడించారు నరేశ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: