ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి ని కాకుండా మరొక దర్శకుడుని అభిమానిస్తాడు అన్న విషయం తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు. ఈ విషయాన్ని స్వయంగా ఒక ప్రముఖ టివి ప్రసారం చేస్తున్న ఒక టాక్ షోలో బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. విజయేంద్ర ప్రసాద్ కథా రచయిత గా ఎప్పుడో పేరు సంపాదించుకున్నప్పటికీ రాజమౌళి కాంబినేషన్ లో అతడు కథలు వ్రాయడం మొదలుపెట్టిన తరువాత మాత్రమే ఆయన నేషనల్ సెలెబ్రెటీ గా మారిపోయాడు.


అదేవిధంగా రాజమౌళి ఇప్పటి వరకు రాజమౌళి తీసిన సినిమా కథలు అన్నీ విజయేంద్ర ప్రసాద్ వ్రాసినవే. తండ్రి కొడుకులుగా మాత్రమే కాకుండా దర్శకుడు రచయితగా జాతీయ స్థాయి గుర్తింపు పొందిన వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ కథ అంటేనే భారీ అంచనాలు ప్రారంభం అవుతాయి. అలాంటి విజయేంద్ర ప్రసాద్ తన కొడుకు ను పక్కకు పెట్టి తాను పూరీ జగన్నాథ్ ను దర్శకుడుగా అభిమానిస్తాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.


దీనికి కారణం దర్శకుడుగా పూరీ స్టైల్ అని అంటూ పూరీ వేగంగా సినిమాలు తీసినంతగా మరెవ్వరు సినిమాలు తీయలేరని అందువల్లనే తనకు పూరీ స్టైల్ నచ్చుతుంది అంటూ అభిప్రాయపడ్డాడు. గతంలో రాజమౌళి భార్య రమ రాజమౌళి ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ తన అభిమాన దర్శకుడు పూరీ జగన్నాథ్ అని చెప్పిన విషయం తెలిసిందే.


అంతేకాదు రాజమౌళి దగ్గర కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేయడం కంటే పూరీ జగన్నాథ్ దగ్గర పనిచేయడం చాల సులువు అని చెపుతూ ఒక పనిచేసి రాజమౌళిని మెప్పించడం చాల కష్టం అంటూ గతంలో ఆమె కామెంట్ చేసింది. అదేవిధంగా తన భర్త  రాజమౌళిని పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ గా చేరి వేగంగా సినిమాలు ఎలా తీయాలో తెలుసుకోమని చెపుతూ ఉంటానని అయితే తన భర్త తన మాట వినడు అంటు జోక్ చేసిన విషయం తెలిసిందే..





మరింత సమాచారం తెలుసుకోండి: