కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ పొందిన దర్శకులలో ఏఆర్ మురుగదాస్ కూడా ఒకరు. అంతే కాకుండా కోలీవుడ్ దర్శకులలో ముఖ్యంగా ఏఆర్ మురుగదాస్ కు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈయన గజిని, తుపాకీ, దర్బార్ వంటి డబ్బింగ్ సినిమాలతో అందరినీ అలరించారు మురుగదాస్. అంతేకాదు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవితో స్టాలిన్, సూపర్ స్టార్ మహేష్ బాబుతో స్పైడర్ వంటి సినిమాలను చేశారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లోనే రామ్ పోతినేని తో ఓ సినిమా చేస్తున్నాడు అని కోలీవుడ్ లో టాక్ కూడా వినిపిస్తోంది.
పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న ఎనర్జిటిక్ రామ్.. తర్వాత రెడ్ చిత్రాన్ని ఇతర భాషల్లో కూడా విడుదల చేశారు. అలాగే ఈ సినిమాను తమిళంలో కూడా విడుదల చేశాడు రామ్. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్స్ లింగు స్వామి తో చేస్తున్న చిత్రాన్ని కూడా అన్ని భాషలలో రూపొందిస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే మురుగదాస్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇటీవలే రామ్ కు మురగదాస్ ఒక స్క్రిప్ట్ వినిపించారని, దీనికి హీరో సైడ్ నుంచి పాజిటివ్ సిగ్నల్ కూడా వచ్చిందని కోలీవుడ్ లో వినికిడి. ఈ విషయం గురించి డిస్కషన్ పూర్తయిన వెంటనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇదే కనుక నిజమైతే క్రేజీ కాంబినేషన్ మూవీ అవుతుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు తెలుగు తమిళ భాషల్లో కూడా ఈ సినిమాని రూపొందించాలని అనుకుంటున్నారట.
ఇప్పుడు లింగు స్వామి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఓ మాస్ ఎంటర్టైనర్ సినిమా అని తెలుస్తోంది. రెండు భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రంలో "ఉప్పెన" హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక రాక్ స్టార్ దేవి ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై ఈ సినిమాని నిర్మించనున్నారు. కరోనా సెకండ్ వేవ్ పూర్తి అయిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి