ఆరడుగుల అందగాడు అఖిల్ చిత్ర పరిశ్రమలో అడుగు పెడుతున్నారని తెలియగానే అక్కినేని అభిమానులు అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అతని సినిమాల మీద ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నారు. కానీ ఆయన హీరోగా నటించిన 4 సినిమాల్లో 3 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. హలో సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది కానీ ఆయన తన కెరీర్ లో ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా సాధించలేకపోయారు. దీంతో అక్కినేని అభిమానులు విసుగెత్తిపోయారు. అయితే ప్రస్తుతం అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు.

ఈ సినిమాకి సంబంధించి కేవలం 3 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. సినిమాకు సంబంధించిన ఫస్ట్ కాపీ జూలై నెలలో రెడీ అవుతుందని తెలుస్తోంది. జీఏ2 పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పిస్తుడటంతో సహజంగానే దీనిపై అంచనాలు పెరిగిపోతున్నాయి. జీఏ2 పిక్చర్స్ నిర్మాణం లో విడుదలైన సినిమాలు టాప్ క్లాస్ క్వాలిటీతో.. మంచి కథాబలం తో తెరకెక్కి సూపర్ హిట్ అయ్యాయి. మరి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా హిట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే ఇంకా మూడు నెలల పాటు వేచి చూడాల్సి ఉందని తెలుస్తోంది.

నిజానికి ఈ సినిమాని జూన్ నెలలోనే విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. కానీ కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో సినిమా వాయిదా పడింది. అయితే ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలోపు సినిమా రిలీజ్ విషయంలో ఒక ఖచ్చితమైన నిర్ణయం మూవీ యూనిట్ తీసుకోనుందని సమాచారం. అప్పటి పరిస్థితులు బాగుంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తారు లేదా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో నేరుగా రిలీజ్ చేస్తారు. అయితే అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రిలీజ్ తేదీ వినగానే తెగ భయపడిపోతున్నారట. ఈ సినిమాని కూడా ప్రేక్షకులు మెచ్చకపోతే.. తన కెరీర్ పై కోలుకోలేని దెబ్బ పడుతుందని ఆయన భావిస్తున్నారట. మరి ఈ సినిమా ఆయనకి మంచి హిట్ తెచ్చిపెట్టి అతనిలో కాన్ఫిడెన్స్ నింపుతుందో లేదో చూడాలి. ఇకపోతే ఆయన ఏజెంట్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: