నాగచైతన్య తన ఫస్ట్ సినిమాతోనే టాలీవుడ్ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపు దక్కించుకున్నారు. దీంతో తండ్రిగా నాగార్జున ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. కెరీర్ తొలినాళ్లలో సినిమా కథల విషయంలో నాగార్జున నాగచైతన్య కు ఎన్నో సలహాలు ఇచ్చేవారు. వీరిద్దరూ తండ్రీ కొడుకుల్లా కంటే మంచి స్నేహితులుగా ఉంటారు. గతంలో నాగార్జున ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చైతుకి తానే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చారు. వీరిద్దరూ కలిసి పార్టీలకి వెళ్తుంటారు. బర్త్ డే పార్టీ కూడా ఇద్దరూ కలిసే చేసుకుంటారు. నాగార్జున కూల్ డాడ్ గా పేరు తెచ్చుకున్నారు. నాగచైతన్య సమంత ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన సమయంలో కూడా నాగార్జున చాలా సపోర్ట్ గా నిలిచారు.

సమంత, చైతన్య వివాహం చేసుకున్న తర్వాత కూడా వారిద్దరికీ ఒక తండ్రిలా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికీ చైతన్య ని చిన్న పిల్లోడిలా భావిస్తూ సంరక్షిస్తుంటారు. ఇక నాగ చైతన్య సినిమా ప్రమోషన్లలో నాగార్జున తప్పకుండా పాల్గొంటారు. ఒక సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని నాగచైతన్య నిలబెడుతున్నారని చెప్పుకొచ్చారు. నాగచైతన్యకి తండ్రి కావడం తనకు గర్వంగా ఉందని కూడా ఆయన అన్నారు. ఇక చైతన్య కూడా తన తండ్రిని బాగా పొగుడుతుంటారు. అన్ని విషయాలు తన తండ్రితో షేర్ చేసుకుంటారు. ఈ తండ్రీకొడుకులద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని చెప్పుకోవచ్చు.

ఇకపోతే ఏ మాయ చేసావే, మజిలీ, వెంకీ మామ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం సాయి పల్లవి తో కలిసి లవ్ స్టోరీ సినిమా చేస్తున్నారు. రాశి ఖన్నా తో కలసి థాంక్యూ సినిమా చేస్తున్నారు. అమీర్ ఖాన్ టైటిల్ రోల్లో నటిస్తున్న లాల్ సింగ్ చద్దా చిత్రంలో ఒక కీలక పాత్రలో నాగచైతన్య నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: