
దిల్ రాజు నిర్మాణ సంస్థలో వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. ఇప్పటికీ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా మేనియా తగ్గటం లేదు. టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ సంగతి అందరికీ తెలిసిందే. ఆయన సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చినట్లు చేస్తారు. ఇక ఆయన రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నటించిన సినిమా వకీల్ సాబ్ ఇటీవలే విడుదలై హిట్ అవ్వగా, ఇప్పుడు తదుపరి చిత్రాలు పై ఆయన ఫోకస్ పెట్టారు.
ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. సాగర్ కే చంద్ర అనే దర్శకుడి దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ సినిమా అయిన అయ్యప్పనుం కోషియం అనే సినిమాను తెలుగు లో రీమేక్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాలో రానా మరో కథానాయకుడిగా నటిస్తున్నాడు. త్రివిక్రమ్ రచనా సహకారం అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే అనుకోకుండా ఓకే అయిన ఈ చిత్రంను పవన్ ఒప్పుకోవడం, షూటింగ్ జరగడం అన్నీ చకచకా జరిగిపోయాయి. వకీల్ సాబ్ తర్వాత పవన్ డేట్స్ పూర్తిగా హరిహర వీరమల్లు చిత్రానికి కేటాయించడం జరిగింది. కానీ ఈ సినిమా కోసం మరి కొన్ని డేట్స్ అడ్జస్ట్ చేసి మరీ సాగర్ చంద్ర కు ఇవ్వడం జరిగింది.
వాస్తవానికి షూటింగ్ కూడా కొన్ని రోజుల వ్యవధిలోనే జరిగిపోయింది. అయితే ఇంత హడావుడిగా అర్జెంటుగా అడ్జస్ట్ చేసి మరి ఇందులో పవన్ కళ్యాణ్ ఎందుకు నటించాల్సి వచ్చింది అన్న అనుమానం ప్రేక్షకుల్లో ఉంది. అందుకు బలమైన కారణం ఉందట. ఈ సినిమా కథలో కథానాయకుడు ఎక్సైజ్ విభాగంలో పనిచేసే ఓ ఎస్ ఐ. ఇది పవన్ జీవితానికి రిలేటెడ్ అయ్యిందట. పవన్ కళ్యాణ్ తండ్రి కూడా ఈ శాఖలో పనిచేసిన పోలీస్ అధికారి. ఇదే ఈ పాత్ర చేయడానికి పవన్ కు ప్రేరణ అని ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. పవన్ గతంలో పోలీసు పాత్రలు చేసిన ఈ తరహా పోలీస్ పాత్రలు చేయలేదు. అంతేకాకుండా ఈ కథలో సామాన్యులకు డబ్బును వ్యక్తులకు సొసైటీ లో ఎలాంటి తేడా ఉంటుంది అనే అంశం ఉందట. ఇది తన రాజకీయ భవిష్యత్తు కూడా ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఒప్పుకోవడానికి ఇవి ముఖ్య కారణాలు అని చెబుతున్నారు.