ఫిలింనగర్ కల్చరల్ క్లబ్లో ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. రెండు మూడు రోజుల నుంచి తనపై వస్తున్న ప్రచారం చూసి బాధేసింది. అందుకే ప్రెస్ మీట్ పెట్టాను అంటూ ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చాడు. నన్ను నాన్ లోకల్ అంటున్నారు. కళాకారులు నాన్ లోకల్ ఏంటి.. అందరూ యూనివర్సల్ అంటూ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. నేను సేవాకార్యక్రమాలు చేస్తున్నప్పుడు నాన్ లోకల్ అనలేదు.. నంది అవార్డులు అందుకున్నప్పుడు నాన్ లోకల్ అనలేదు. కానీ ఇప్పుడు మాత్రం నాన్ లోకల్ అనే విషయం ఎందుకు గుర్తొచ్చింది అంటూ ప్రశ్నించారు. పదవి కోసం రాలేదని తన ప్యానెల్ లో నలుగురు అధ్యక్ష అభ్యర్థులు ఉన్నారంటూ ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.
కెసిఆర్ జగన్ అంటూ ప్రచారం చేస్తున్నారని అలాంటి ప్రచారాలు ఆగితే బాగుంటుందన్నారు ఇక మరికొన్ని రోజుల్లో ఏకంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ ను సైతం ఇక ఈ మా ఎన్నికల కోసం ఉపయోగించుకుంటారు అంటూ వ్యాఖ్యానించారు. గొడవలతో కాకుండా సైలెంట్గా అందరం కలిసి పని చేద్దాం పిలుపునిచ్చారు. ఇక మా ప్రచారంలోకి చిరంజీవి మోహన్ బాబు అని ఎందుకు లాగుతున్నారు అంటూ ప్రశ్నించారు ప్రకాష్ రాజు. తనకు పదవిపై ఆశ లేదని.. తన ప్యానెల్ లో నలుగురు అధ్యక్షుడు ఉన్నారని తప్పు చేస్తే వారే నన్ను బయటకు పంపిస్తారు అంటూ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి