బాలీవుడ్ ప్రముఖ హీరో అర్జున్‌ కపూర్‌ని బ్యాడ్ లక్ వెంటాడుతోంది. ఏది అనుకున్నా.. అది ఫెయిల్యూరే అవుతోంది. దీంతో ఆయన కెరీర్ ఇమేజ్ డౌన్ అయిపోతోంది. వరుసగా వెంటాడుతున్న శ్రమల నుండి బయటపడాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా అందులో సక్సెస్ కావడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక డైలమాలో ఉన్నాడు అర్జున్ కపూర్.  

అర్జున్‌ కపూర్‌కి బాలీవుడ్‌లో బ్యాక్‌ గ్రౌండ్ పెద్దగానే ఉంది. అయితే అందుకు తగ్గట్టుగా స్టార్డమ్ మాత్రం రావడం లేదు. పైగా సినిమా సినిమాకి  ఆయన ఇమేజ్ డౌన్ అయిపోతోంది. అర్జున్‌ కపూర్‌కి గత ఏడేళ్లుగా వరుస నష్టాలు చవిచూస్తున్నాడు.  'హాఫ్ గర్ల్ ఫ్రెండ్' తర్వాత అర్జున్ చేసిన సినిమాలన్నీ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.  భారీ బడ్జెట్‌తో హిస్టారికల్ డ్రామాగా వచ్చిన 'పానిపట్' బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. ఈ అపజయంతో అర్జున్‌ ప్రేక్షకులని అప్పటిలా శాటిస్ ఫై చేయలేకపోతున్నాడు.  

అర్జున్‌ కపూర్‌ వరుస అపజయాలు చవిచూస్తున్నా.. కపూర్ కాందాన్‌ అండతో బిజీగానే గడుపుతున్నాడు.  రెండేళ్ల నుంచి ఈ హీరో నటించిన సినిమాలు థియేటర్లకు దూరంగా ఉంటున్నాయి. కరోనా లాక్‌డౌన్‌తో థియేటర్లకు తాళాలు పడటంతో  ఓటీటీలో విడుదల కాక తప్పడం లేదు. 'సందీప్ ఔర్ పింకీ ఫరార్, సర్దార్‌ కా గ్రాండ్‌సన్' సినిమాలు రెండూ ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి.  అర్జున్ కపూర్ కొత్త మూవీ 'భూత్ పోలీస్' కూడా ఓటీటీలోనే విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశం లేకపోవడంతో ఈ నిర్ణయం తప్పడంలేదు.

సినిమాలు థియేటర్‌లో విడుదల అయితేనే ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఓటీటీలో ఆ సినిమాలకు అంతగా ఆదరణ ఉండదు. అర్జున్‌ కపూర్‌ కూడా ఇప్పుడు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాడు. వరుసగా ఓటీటీల్లోనే సినిమాలు విడుదల చేస్తే.. థియేటర్‌ ఆడియన్స్‌కి దూరమవుతానేమో అనే భయం ఈ బాలీవుడ్ హీరోను వెంటాడుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: