ఈ క్రమంలోనే గతంలో కొన్నిసార్లు డాక్టర్లు ఏకంగా కొంత మంది హీరోలకు సంబంధించిన సినిమాలను చూపిస్తూ ఇక చాలామందికి మెదడుకి సంబంధించిన ఆపరేషన్లు చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇలా సినిమాలు చూపిస్తూ ఎంతోమందిని మెలకువగానే ఉంచుతూ ఆపరేషన్ చేస్తున్న సమయంలో వారి మెదడు పనితీరును పరీక్షిస్తూ వైద్యులు ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఇలా పలు సినిమాలు కార్యక్రమాలు పేషెంట్ కి చూపిస్తూ చేసిన మెదడు ఆపరేషన్లు ఎన్నో సక్సెస్ అయ్యాయి. అయితే ఇక్కడ ఇలాంటి మరొక ఆపరేషన్ చేశారు వైద్యులు.
తలకు తీవ్ర గాయాలపాలైన ఒక బాలుడు ఇటీవలే ఆస్పత్రిలో చేరాడు. అతనికి ఇళయ దళపతి విజయ్ సినిమా చూపించి వైద్యం చేశారు డాక్టర్లు చెన్నైలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మైలాపూర్ కు చెందిన శశి అనే యువకుడు బైక్ ఆక్సిడెంట్ బారిన పడ్డాడు. ఈ క్రమంలోనే తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా తలకి ఎంతో బలంగా తగిలింది. ఈ క్రమంలోనే స్థానికులు వెంటనే స్పందించి అతనిని ఆసుపత్రికి తరలించారు. అయితే అతని తలకి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆపరేషన్ చేసే సమయంలో మత్తు ఇంజెక్షన్లు ఇవ్వద్దు అంటూ ఆ యువకుడు భయపడిపోయాడు. ఈ క్రమంలోనే అతని ఫేవరెట్ హీరో ఇళయ దళపతి విజయ్ అని తెలుసుకున్నారు వైద్యులు. ఇక విజయ్ హీరోగా నటించిన బిగిల్ సినిమా చూపిస్తూ ఆ యువకుడికి చికిత్స అందించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి