సినిమా రంగం అంటేనే గ్లామర్ ఫీల్డ్. సినిమా రంగంలో ఆకర్షణలు - ప్రేమలు - డేటింగ్ లు - సహజీవనం - పెళ్ళిళ్ళు - విడాకులు చాలా కామన్ గా జరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడు ఏ హీరో హీరోయిన్లు కలిసి ఉంటారు ? ఎవరు ఎవరికి బ్రేకప్ చెప్పేస్తారు ? ఎవరు ఎవరితో కొత్త స్నేహాలు , ప్రేమలు పంచుకుంటారు అన్న‌ది.. ఎప్పుడు అంచనా వేయలేని పరిస్థితి. నిన్నటివరకు చెట్టాపట్టాలేసుకొని కలిసి ఉన్న హీరో, హీరోయిన్లు రేపు మరొకరి ప్రేమలో మునిగి తేలుతూ ఉంటారు. అయితే ప్రేమించుకోవ‌టం.. విడిపోవటం సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి సహజమే అయినా... కొన్ని ప్రేమలు బ్రేక‌ప్ అవ్వ‌డం వారి అభిమానులకు కూడా బాధను కలిగిస్తాయి. బాలీవుడ్‌లో ఒక‌ప్పుడు ఫేమ‌స్ క‌పుల్ అయిన దీపిక  - ర‌ణ‌బీర్ ప్రేమ విచ్ఛిన్నం కూడా ఎంతో మంది సినీ ల‌వ‌ర్స్‌ను బాధ పెట్టింది.

ఎప్పుడో 2008లో వీరి మ‌ధ్య స్నేహం కుదిరింది. లంచ్ నుంచి సాయంకాలం వ‌ర‌కు కాపీ మీట్‌లో మునిగి తేలారు. ఆ త‌ర్వాత మాట‌లు క‌లిశాయి... చివ‌ర‌కు ఆ రోజు నైట్ సినిమా చూసే వ‌ర‌కు వెళ్లారు. ఆ మరుస‌టి రోజు నుంచే ఫ్రెండ్స్ అయిపోయారు. ర‌ణ‌బీర్ క‌ళ్ల‌లో చూడ‌గానే క‌నిపించే అమాయ‌క‌త్వం ఎంతోమందిని ఆక‌ట్టుకుంది. దానికే దీపిక ప‌డిపోయింది. చివ‌ర‌కు దీపిక‌ను ఇంటి ద‌గ్గ‌ర దిగ‌బెట్టే వ‌ర‌కు గాడ‌మైన స్నేహం ఏర్ప‌డింది. వాళ్లిద్ద‌రు క‌లిసి న‌టించిన తొలి సినిమా బచ్‌నా ఏ హసీనో. ఆ సినిమా స‌మ‌యంలో వారిద్ద‌రు ప్రేమికులు అయిపోయారు.

దీపిక మాత్రం ర‌ణ‌బీర్‌తోనే జీవితం పంచుకోవాల‌ని ఫిక్స్ అయిపోయింది. ఆమెకు న‌మ్మ‌కాలు.. ఎమోష‌న్లు ఎక్కువ‌. అయితే బీ టౌన్ జ‌నాల‌కు ర‌ణ‌బీర్ గురించి బాగా తెలుసు. ర‌ణ‌బీర్ ఆమెకు ఖ‌చ్చితంగా హ్యాండ్ ఇస్తాడ‌నే అనుకున్నారు. చివ‌ర‌కు అదే జ‌రిగింది. దీపిక‌తో ప్రేమలో అతడికి సీరియస్‌నెస్‌ లేదని చాలా మంది గ్ర‌హించారు. ఎందుకంటే ర‌ణ‌బీర్ అప్ప‌టికే క‌త్రీనా వెంట ప‌డుతున్నారు. చివ‌ర‌కు దీపిక‌కు ఎవ్వ‌రూ ఏమీ చెప్పినా న‌మ్మ‌లేదు... ఓ రోజు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు... చివ‌ర‌కు ఆమె గుండె ప‌గిలింది.. ఎంతో బాధ‌తో ఆమె అత‌డికి బ్రేక‌ప్ చెప్ప‌క త‌ప్ప‌లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: