ప్రస్తుతం బుల్లితెరపై చక్రం తిప్పుతున్న సుడిగాలి సుధీర్ అలాగే హైపర్ ఆది ఇద్దరూ కూడా జబర్దస్త్ షో నుంచి వచ్చిన వారే. ఇంకా వీరితోపాటు ఎంతోమంది నటీనటులకు , జబర్దస్త్ షో ఒక వరంగా మారింది. అయితే వీరితో పాటు మరెంతో మంది ప్రేక్షకులు కూడా జబర్దస్త్ షోలో తమ టాలెంట్ ఏంటో చూపించాలని అనుకుంటున్నారు. అయితే ఇక్కడ గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న విమర్శలు ఏమిటంటే , జబర్దస్త్ షో లో కొత్త వాళ్ళకి అనుమతి ఇవ్వరని, అక్కడ ఉన్న వాళ్ళకి,వారికి నచ్చిన వారిని మాత్రమే తీసుకువచ్చి పెడుతుంటారు అని..
అయితే ఈ విషయంపై జబర్దస్త్ కమెడియన్ లలో ఒకరైన అదిరే అభి కూడా స్పందించారు. సోషల్ మీడియా ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఆదిని తీసుకొచ్చి, జబర్దస్త్ షోలో కమెడియన్ గా పరిచయం చేసి, హైపర్ ఆది గా మార్చేశాడు మన అదిరే అభి. అందుకే అదిరే అభిని చాలామంది సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యి, వారికి కూడా జబర్దస్త్ షో లో లైఫ్ ఇవ్వమని అడుగుతున్నారు. ఇక ఇప్పుడు అవకాశం రావడంతో ఆయన స్పందించాడు. ఇక అదిరే అభి మాట్లాడుతూ.." మేము మీకు అవకాశం ఇవ్వడం కాదు. ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షో కి ఆడిషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి మీలో టాలెంట్ ఉంటే , మీరు కూడా మీ టాలెంట్ చూపించి గర్వంగా జబర్దస్త్ స్టేజి పైన అడుగు పెట్టవచ్చునని.. ఒక వీడియో రూపంలో విడుదల చేశాడు.
అంతేకాదు ఈ వీడియోలో ఎలాంటి వీడియోలు చేయాలి, ఏం చేస్తే కమెడియన్ గా జబర్దస్త్ లోకి అడుగు పెడతాము.. అని కూడా కొన్ని టిప్స్ అందిస్తున్నాడు అభి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. రెండు నిమిషాల నిడివి కలిగిన ఒక వీడియోలో, మీ టాలెంట్ మొత్తం చూపించి జబర్దస్త్ ఆడిషన్స్ కు పంపించండి. ప్రస్తుతం మల్లెమాల యూనిట్ కొత్త వాళ్ళ కోసం ఎదురు చూస్తోందని కూడా చెప్పాడు అదిరే అభి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి