కథానాయకుడి ఇమేజ్ బాగా పెరగాలంటే విలన్ ను ఓ రేంజ్ లో చూపించాలి. రావణాసురుడిలా కర్కశత్వం చూపిస్తేనే గానీ హీరో హైలెట్ కాడు. హీరో రాముడిలా ప్రేక్షకులకు దగ్గరవుతాడు. ఇప్పుడు బాలీవుడ్‌ మేకర్స్ వెండితెర రామాయాణానికి ఇలాంటి ఫార్ములానే వాడుతున్నారు. టాప్ హీరోలని లంకాధిపతులుగా మారుస్తున్నారు.  

ఎప్పుడూ మాస్ మూవీస్ తో ప్రేక్షకులను థియేటర్ల బాట పట్టించే ప్రభాస్ రూట్ మార్చేశాడు. రామాయణ కావ్యంలో నటిస్తున్నాడనే విషయం తెలియగానే ఆడియన్స్ లో ఆశ్చర్యం కలిగింది.  ఆ సినిమాపై ఆసక్తి ఒక రేంజ్ లో పెరిగిపోయింది. ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఊహల్లో మునిగిపోయారు అభిమానులు.  ఈ బజ్‌కి తగ్గట్లే రావణాసురుడి పాత్రని స్ట్రాంగ్‌గా డిజైన్ చేశాడు దర్శకుడు ఓం రౌత్. బాలీవుడ్‌ స్టార్ సైఫ్ అలీఖాన్‌ని రావణ్‌ పాత్రకి సెలక్ట్ చేసుకున్నాడు.

సైఫ్ అలీ ఖాన్‌ అంతకుముందే 'తానాజీ'  సినిమాలో విలన్‌గా తన టాలెంట్ ఏంటో చూపించాడు. ఉదయభాను సింగ్ రాథోడ్ పాత్రతో సినిమాకే హైలైట్‌గా నిలిచాడు. దీంతో ఓం రౌత్ మరో ఆలోచన లేకుండా సైఫ్‌ అలీ ఖాన్‌ దగ్గరికి వెళ్లిపోయాడు. 'ఆదిపురుష్'లో రావణాసురుడి పాత్ర ఆఫర్ చేశాడు.

రామాయణం శ్రీరాముని చరితే అయినా సీత పాత్ర లేకుండా ఈ గాథ లేదు. సీత కోణంలో రామాయణం చెప్పిన కవులు చాలామంది ఉన్నారు. ఈ గాథల ఆధారంగానే అలౌకిక్‌ దేశాయ్ 'సీత' అనే సినిమా తీస్తున్నాడు. తెలుగు రచయిత కె.విజయేంద్ర ప్రసాద్‌ ఈ సినిమాకి కథ అందిస్తున్నాడు. ఈ సీతాయణంలో రణ్‌వీర్‌ సింగ్‌ రావణాసురుడిగా నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది.

రణ్‌వీర్‌ సింగ్‌ 'పద్మావత్' సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీగా నెగటివ్‌ క్యారెక్టర్ ప్లే చేశాడు. సంజయ్ లీలా భన్సాలీ ఈ మూవీని హీరోయిన్ సెంట్రిక్ సబ్జెక్ట్‌గా డిజైన్ చేసినా, రణ్‌వీర్ హైలైట్‌ అయ్యాడు.  ఖిల్జీ క్యారెక్టర్‌లో భయంకరమైన ఆటిట్యూడ్ చూపించి, హీరో షాహిద్‌ కపూర్, హీరోయిన్ దీపిక పదుకొణే ఇద్దరినీ డామినేట్ చేశాడు. అందుకే రణ్‌వీర్‌ని రావణాసురుడిగా చూపించాలనుకుంటున్నారట మేకర్స్.



మరింత సమాచారం తెలుసుకోండి: