నిజానికి అరవిందస్వామి సినీ ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యాక ఒక సాఫ్ట్వేర్ కంపెనీని నిర్వహిస్తూ ఉండేవాడు. ఇక ఈయనకు పెళ్లయి ఒక కూతురు కుమారుడు కూడా ఉన్నారు. కొన్ని వివాదాల కారణంగా అరవిందస్వామి ఆయన సతీమణి తో విడాకులు కూడా తీసుకోవడం జరిగింది . ఇకపోతే ఆయన కూతురు అదిర మాత్రం అరవింద స్వామి సమక్షంలో ని పెరగడం గమనార్హం. అదిర తండ్రి కంటే తెలివైనది. ఈమె లండన్ లో డిగ్రీ పూర్తి చేసి , అక్కడ గోల్డ్ మెడల్ కూడా పొందింది.
ఇక అరవిందస్వామి సినిమాలలో బాగా సెట్ అవుతాడని ఎవరు చెప్పడంతో ఆయన తమిళ్ సినిమాలో మొదట నటుడిగా నటించేవాడు. ఇక ఆ తరువాత అవకాశాలు లేక సినీ ఇండస్ట్రీకి దూరమై, సాఫ్ట్ వేర్ కంపెనీని చూసుకోవడం మొదలుపెట్టాడు. ఇక మళ్ళీ తన్ని ఒరువన్ అనే సినిమా తో రీఎంట్రీ ఇచ్చాడు అరవిందస్వామి. ఇక ఇదే సినిమాను తెలుగులో ధ్రువ పేరుతో రీమేక్ చేయగా, ఈ సినిమాలో కూడా విలన్ గా నటించడం గమనార్హం.ఇక ప్రస్తుతం ఆయన కూతురు అదిర సాప్ట్ వేర్ కంపెనీ కు సంబంధించిన అన్ని విషయాలను, ఆమె చూసుకోవడం గమనార్హం. తండ్రి సినిమాలలో బిజీగా ఉంటే, కూతురు సాఫ్ట్ వేర్ రంగాన్ని నడిపిస్తూ, ముందుకు వెళుతోంది. ఈ కంపెనీ యొక్క అన్ని బాధ్యతలను ఆమె తీసుకుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి