ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్ లలో ఒకరు గా కొనసాగుతున్నారు గణేష్ మాస్టర్. గణేష్ పాస్టర్ పేరు వచ్చిందంటే చాలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన గణేష్ మాస్టర్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ డాన్స్ మాస్టర్ గా కొనసాగుతున్న గణేష్ మాస్టర్   గత కొంత కాలం నుంచి ఈ టీవీలో ప్రసారమయ్యే ఢీ అనే డాన్స్ రియాల్టీ షోలో జడ్జిగా అవతారమెత్తాడు.



 ఒకప్పుడు శేఖర్ మాస్టర్ జడ్జిగా వ్యవహరిస్తున్న ప్లేస్ లో ఛాన్స్ కొట్టేశాడు గణేష్ మాస్టర్.. ఇక తనదైన శైలిలో జడ్జిమెంట్ ఇస్తూ ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తున్నాడు. అయితే ఇటీవలే ఢీ షోలో భాగంగా గణేష్ మాస్టర్ కన్నీళ్ళు పెట్టుకొని చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇంతకీ గణేష్ వెక్కివెక్కి ఏడవడానికి కారణం ఏంటి అంటారా. ఇటీవల విడుదలైన ఢీ సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్లో బ్లాక్బస్టర్ సినిమాలకు సంబంధించిన కాన్సెప్టుతో ఢీ షోలో పర్ఫామెన్స్ చేస్తారు. ఈ క్రమంలోనే వకీల్ సాబ్  సినిమాకు సంబంధించిన కాన్సెప్టుతో కూడా పర్ఫామెన్స్ చేస్తారు.




 ఇక ఈ కాన్సెప్టుతో డాన్స్ పర్ఫార్మెన్స్ వస్తున్నంత సేపు  గణేష్ మాస్టారు కన్నార్పకుండా చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే  పర్ఫామెన్స్ లో భాగంగా.. ఆడపిల్లలు చిన్న చిన్న బట్టలు వేసుకుంటే మగవాళ్ళు టేమిట్ అవుతారు.. మరి తొమ్మిది నెలల పసికందు.. మంచాన పడ్డ పండు  ముసలి... ఏం కనిపించిందని కమిటయ్యారురా అంటూ ఇక వకీల్ సాబ్ సినిమాలో నుంచి ఒక డైలాగ్ రాగానే గణేష్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు ఇక వెక్కివెక్కి ఏడుస్తూ పిచ్చి *** కొడకల్లారా చిన్నపిల్లల్లో ఏం కనిపించింది రా మీకు అంటూ ఎమోషనల్గా డైలాగ్ చెప్పారు గణేష్ మాస్టర్. దీంతో ఆ పక్కనే ఉన్న పూర్ణ, ప్రియమణిలు గణేష్ మాస్టర్ ని ఓదార్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: