అసలు విషయంలోకి వెళితే ... టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుండే చిరు హైపర్ ఆది ప్రతిభకు మెచ్చి తన చిత్రంలో ఓ క్యారెక్టర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే విషయాన్ని చెప్పడానికి ఇంటికి పిలిపించి మరీ సర్ప్రైజ్ చేసినట్లు చెబుతున్నారు. టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి ప్రతిభను ప్రోత్సహించడానికి తనవంతు సాయం తాను చేస్తుంటారు. గతంలో కూడా ఎంతో మంది ఆర్టిస్టులకు పిలిచి మరీ లైఫ్ ఇచ్చారు చిరు. ఇప్పుడు ఇదే తరహాలో హైపర్ ఆదికి కీలక పాత్రను ఇవ్వమని డైరెక్టర్ కు చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయం పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు.
మరి ఈ విషయం ఎంతవరకు కరెక్ట్ అన్నది తెలియాల్సి ఉంది. గతంలో సైరా నరసింహారెడ్డి సినిమాను జబర్దస్త్ షోలో స్కిట్ గా చూపించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు ఆది. ఇంకా ముందు ముందు ఎన్ని సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటాడో చూడాలి. ఆది మంచి రైటర్ కాబట్టి ఆ విధంగా కూడా ఆదిని వాడుకోవచ్చని తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి