రావణాసురుడు లాంటి విలన్ సీత లాంటి హీరోయిన్ ను కిడ్నాప్ చేస్తే హీరో ఎలా కాపాడాడు అనేది కథ అని చెప్పాడట.ms. రాజుకు ఆ పాయింట్ బాగా నచ్చిందట ఆ పాయింట్ ను బేస్ చేసుకొని కథ సిద్ధం చేయమని చెప్పాడట.బాబీ సినిమాతో ప్లాప్ ను మూట కట్టుకున్న శోభన్ ను స్క్రిప్ట్ రాయడానికి సహాయం అడిగాడట.స్క్రిప్ట్ రైటర్ గా పేరున్న శోభన్ ఈ సినిమాకు మంచి సీన్స్ చెప్పాడట. తన టాలెంట్ నచ్చి వర్షం సినిమాకు డైరెక్టర్ గా అవకాశం ఇచ్చాడటా ms. రాజు.స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయింది.ప్రభాస్ కు పోటీగా వుండే విలన్ ఎవరు అంటే టక్కున గోపీచంద్ పేరు వినిపించింది. వెంటనే ఈ సినిమాకు గోపిచంద్ ను విలన్ గా చేయడానికి ఒప్పించారు.
హీరోయిన్ గా గంగోత్రి ఫేమ్ అధితి అగర్వాల్ పేరు వినిపించింది. కానీ ms. రాజు తమిళ్ సినిమా సామి హీరోయిన్ గా చేసిన త్రిషను ఎంపిక చేసారు.టీం మొత్తం కుదిరాక 2003 march 14న షూటింగ్ స్టార్ట్ చేసారు. ఈ సినిమాతో ప్రభాస్ ను స్టార్ హీరో స్థాయికి తీసుకెళ్ళింది. హీరోయిన్ త్రిషకు కూడా స్టార్ హీరోలతో చేసే ఆఫర్ తెచ్చి పెట్టింది. ఇదిలా ఉంటే భారీ విజయం సాధించిన ఈ సినిమా కథ ఒక హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టినట్లు టాక్ వినిపిస్తుంది. ఆ సినిమానే స్ట్రీట్ అఫ్ ఫైర్స్ అనే హాలీవుడ్ మూవీ. ఈ సినిమా హాలీవుడ్ లో మాత్రం అంతగా ఆకట్టుకోలేదట. ఇదిలా ఉంటే వర్షం సినిమా అయిన మాధురి దీక్షిత్ ను స్టార్ హీరోయిన్ చేసిన తేజం సినిమాను పోలి ఉన్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. ఈ మూడు సినిమాల్లో పాయింట్ ఒకేలా ఉండటం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి