అగ్రశ్రేణి టాలీవుడ్ హీరోయిన్లు అయిన సమంత అక్కినేని, రష్మిక మందాన తమ ఫిట్నెస్ కాపాడుకోవడానికి కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారు. వీరిద్దరూ తమ ఇంటెన్స్ వర్కౌట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. హీరోలకి ఏమాత్రం తీసిపోకుండా ఇష్టమైన వ్యాయామాలు చేస్తూ అభిమానుల్లో ఫిట్నెస్ గోల్స్ పెంచుతుంటారు. ఈ హీరోయిన్లు వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన డైట్ ఫాలో అవుతుంటారు. అయితే ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు. కానీ అందర్నీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. వర్కౌట్ విషయంలో కుర్రహీరోయిన్ రష్మిక కంటే సమంతానే ఒక అడుగు ముందు ఉంటారు. బరువులు ఎత్తడం లో గాని.. యోగా చేయడం లోగాని సమంతానే ముందున్నారు.
అయితే పొత్తికడుపు భాగాన్ని దృఢంగా మలచడానికి చేసే వ్యాయామాన్ని ప్లాంక్స్ అంటారు. ఈ ఎక్సర్సైజ్ చేయాలంటే చాలా స్టామినా కావాల్సి ఉంటుంది. ఇది చేసే సమయంలో శరీరంపై విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతుంది. శరీరంలో వణుకు తో పాటు చెమట కూడా వస్తుంది. అయితే
సమంత ఈ అత్యంత కష్టమైన ప్లాంక్స్ అత్యంత సులభంగా చేసి ఆశ్చర్యపరిచారు. ఒంటిచేత్తో ప్లాంక్స్ చేసి తనకు తానే సాటిగా ఆమె నిరూపించారు.
అయితే
రష్మిక మాత్రం ప్లాంక్స్ చేయడానికి చాలా కష్ట పడినట్లు ఆమె షేర్ చేసిన వీడియో లో కనిపించింది. రెండు చేతులతో ప్లాంక్స్ చేస్తూ నాజూకైన సొగసు కోసం ఆమె చేసే కృషి చూడొచ్చు. కానీ సమంతతో పోల్చితే
రష్మిక అవలీలగా ప్లాంక్ చేయలేకపోయారు. దీంతో
సమంత అభిమానులు గర్వంగా ఫీల్ అవుతూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించిన ప్లాంక్ వర్కౌట్ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో
రష్మిక నటిస్తుండగా.. శాకుంతలం అనే సినిమాలో
సమంత నటిస్తున్నారు. రెండూ కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే కావడం విశేషం.