ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. దాదాపుగా రెండు సంవత్సరాల పాటు మూతబడిన థియేటర్లు మళ్లీ కొత్తగా ముస్తాబయ్యాయి. కరోనా కారణంగా అన్ని మూతబడ్డాయి. కేసులు తగ్గడం వల్ల థియేటర్లు ఓపెన్ అయ్యాయి. దీంతో సినీ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం ప్రారంభించారు. సినిమాలు కూడా వరుసగా రిలీజ్ కావడంతో అందరూ పండగ చేసుకుంటున్నారు. వారంలో ఐదారు సినిమాలు విడుదలకు సిద్దమయ్యాయి. థియేటర్లు ప్రారంభమైన మూడు వారాల్లోనే మూడు సినిమాలు విడుదల అయ్యాయి. ఆ సినిమాలు వినోదాన్ని పంచాయి. ఇకపోతే తిమ్మరుసు. SR కళ్యాణమండపం, సినిమాలు విజయవంతం అవ్వగా పాగల్ సినిమాకు కాసుల వర్షం కురుస్తోంది. టాలీవుడ్ బాక్సాఫీస్ ఇప్పుడిప్పుడే లాభాల బాట పడుతోంది. రానున్న మూడు నెలల్లో ఇంకొన్ని సినిమాలు థియేటర్లలో కనువిందు చేయనున్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈవారంలో శుక్రవారం రోజు 5 సినిమాలు రిలీజ్ కానున్నాయి. అందులో శ్రీ విష్ణు హీరోగా మేఘ ఆకాష్ హీరోయిన్ గా రాజ రాజ చోర అనే సినిమా ఉంది. ఆ సినిమాను ఆగస్టు 19న తేదీన రిలీజ్ చేయనున్నారు. ఆ రోజే హీరో సునీల్ నటించిన 'కనబడుటలేదు' సినిమా రిలీజ్ కానుంది. ఇకపోతే శ్రీముఖి నటించిన 'క్రేజీ అంకుల్స్' సినిమా బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు 'బజార్ రౌడీ' సినిమాలు కూడా ఈ వారంలోనే విడుదల కానున్నాయి. ఆ సినిమాలతో పాటుగా 'చేరువైనా దూరమైనా' అనే మూవీ కూడా విడుదల కానుంది. ఇకపోతే ఆగస్టు 27వ తేదీన సుధీర్ బాబు నటించిన ''శ్రీదేవి సోడా సెంటర్'' మూవీని రిలీజ్ చేయనున్నారు. అక్కినేని కుటుంబ హీరో అయిన సుశాంత్ ''ఇచ్చట వాహనములు నిలుపరాదు'' అనే సినిమాతో మనముందుకు రానున్నారు. సెప్టెంబర్ 3వ తేదీ సందీప్ కిషన్ 'గల్లీ రౌడీ', అవసరాల శ్రీనివాస్ '101 జిల్లాల అందగాడు' సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: