బండ్ల గణేష్ కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత  రవితేజ హీరోగా నయనతార  హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన  'ఆంజనేయులు' సినిమాతో ప్రొడ్యూసర్ గా మారాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోవడం తో పవన్ కళ్యాణ్ హీరోగా తీన్ మార్ , గబ్బర్ సింగ్ సినిమాలను నిర్మించాడు. ఇందులో 'గబ్బర్ సింగ్' సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో పాటు బండ్ల గణేష్  కు ప్రొడ్యూసర్ గా మంచి పేరు తీసుకువచ్చింది. ఆ సినిమా ఇచ్చిన జోష్ లోనే బండ్లగణేష్ తెలుగులో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించాడు. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ తో కూడా బండ్ల గణేష్ బాద్ షా , టెంపర్ అనే రెండు సినిమాలను నిర్మించాడు. అయితే 'టెంపర్' సినిమా అనంతరం రెమ్యునరేషన్ విషయంలో బండ్ల గణేష్ కు ఎన్టీఆర్ మధ్య గొడవ జరిగినట్లు అప్పట్లో సోషల్ మీడియా వేదికగా అనేక వార్తలు వచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగినట్లు అనేక వార్తలు వచ్చాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి బండ్ల గణేష్ మాట్లాడుతూ అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి.

ఇది కూడా దాదాపు అలాంటిదే , మా మధ్య మిస్ కమ్యూనికేషన్ వల్ల మాత్రమే అలా జరిగింది , దానిని గొడవ అని అనలేం , ఎన్టీఆర్ తో నాకు ఎలాంటి విభేదాలు లేవు అంటూ బండ్ల గణేష్ ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే 'టెంపర్' సినిమా తర్వాత తాత్కాలికంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన బండ్ల గణేష్ మళ్లీ నిర్మాతగా ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు. పవన్ కల్యాణ్ తో ఓ సినిమాను నిర్మిస్తున్నట్లు ఇప్పటికే బండ్లగణేష్ ప్రకటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: