అయితే, తాజాగా మరో గ్లామరస్ హీరోయిన్ పేరు కూడా ఈ సాంగ్ కోసం పరిశీలనలో ఉందనే టాక్ వచ్చింది. ఈ వార్త బయటకు రావడంతో అభిమానులు కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “మృణాల్ తప్ప మరెవ్వరూ వద్దు” అంటూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని బలంగా చెబుతున్నారు. దీంతో డైరెక్టర్ చివరకు ఎవరిని ఫైనల్ చేస్తారన్న ఆసక్తి మరింత పెరిగింది. ఇక ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నది ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ కావడం మరో ప్రత్యేక ఆకర్షణ. ఆయన సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
మొత్తానికి, పెద్ది సినిమా ఇప్పటికే మంచి హైప్ సృష్టించుకోగా, ఈ స్పెషల్ సాంగ్ విషయంలో ఉన్న సస్పెన్స్ మాత్రం అభిమానులను మరింత ఉత్కంఠకు గురిచేస్తోంది. ఈ విషయంలో త్వరలో క్లారిటీ వస్తుందో లేదో చూడాలి. కానీ ఫ్యాన్స్ మాత్రం మృణాల్ నే ఫిక్స్ అయిపోయారు. లాస్ట్ మినిట్ లో డైరెక్టర్ ఏం చేస్తారో చూడాలి..!?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి