ఒక మారుమూల గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులందరికీ బర్నింగ్ స్టార్ గా మారిపోయాడు. అయితే సంపూర్ణేష్ బాబు సినిమాలో అదిరిపోయే కామెడీ మాత్రమే కాదు అందరినీ అబ్బుర పరిచే డైలాగులు కూడా ఉంటాయి. ఏకంగా పేజీలకు పేజీలు డైలాగులు ఒకే టేక్ లో చెప్పగల సత్తా సంపూర్ణేష్ బాబు సొంతం. ఇప్పటివరకు తన సినిమాల్లో ఎన్నో భారీ డైలాగులు చెప్పి ప్రేక్షకులందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు సంపూర్ణేష్ బాబు. ఇక సంపూర్ణేష్ బాబు చెప్పిన ప్రతి డైలాగ్ లు కూడా ఒక మంచి అర్థం కూడా ఉంటుంది. అయితే ఇటీవల ఏకంగా సంపూర్ణేష్ బాబు చెప్పిన ఒక భారీ డైలాగ్ కి ఏకంగా డైలాగ్ కింగ్ ఫిదా అయిపోయాడు.
భారీ డైలాగులు చెప్పాలన్న.. భయపెట్టే డైలాగులు చెప్పాలన్న కేరాఫ్ అడ్రెస్ సాయి కుమార్. తన బేస్ వాయిస్ తో డైలాగులు చెబుతుంటే ప్రేక్షకులు ఫిదాఅవుతూ ఉంటారు. అలాంటి సాయికుమార్ ఇటీవల సంపూర్ణేష్ బాబు డైలాగ్ కి ఫిదా అయిపోయారు. సాయికుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న వావ్ అనే కార్యక్రమానికి సంపూర్ణేష్ బాబు గెస్ట్ గా వచ్చారు. ఏమయ్యా.. సినిమాల్లో పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి అంటూ అడుగుతాడు సాయికుమార్.. ఈ క్రమంలోనే తన సినిమాలో నుంచి ఆడవాళ్ళను ఉద్దేశిస్తూ ఒక డైలాగ్ చెబుతాడు సంపూర్ణేష్ బాబు. ఇక భారీ డైలాగ్ సంపూర్ణేష్ బాబు గుక్కతిప్పుకోకుండా చెప్పడంతో అటు సాయికుమార్ అంటూ ఫిదా అయిపోతారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి