కొంత మంది హీరోయిన్ లకు ఎప్పుడు ఎలా దశ తిరుగుతుందో ఎవరు చెప్పలేరు. వారు ఒకటి తలిస్తే సినిమా మరొకటి తలుస్తుంది అన్నట్లుగా వారు ఒక భాషలో రాణించాలని వస్తే మరొక భాష లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతారు. ఆ విధంగా తెలుగు లో ప్రేక్షకులకు పరిచయమై తమిళనాట స్టార్ హీరోయిన్ లుగా ఎదిగిన తెలుగు అమ్మాయిలు కొంత మంది ఉన్నారు. వారు ఎవరు ఇప్పుడు చూద్దాం. ఎన్నో ఆశలతో తెలుగు సినిమా పరిశ్రమలో రాణించాలని చెప్పి కొంత మంది హీరోయిన్ లు తెలుగునాట తమ అదృష్టాన్ని పరీక్షించుకాగా ఇక్కడ అదృష్టం కలిసి రాక వెనక పడిపోతారు. అయితే ఇతర భాషలలో వీరికి అవకాశం అవలీలగా వచ్చేస్తుంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన ముద్దుగుమ్మ అంజలి. తెలుగులో ఒకటి రెండు సినిమాల్లో నటించినా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో తమిళంలో అవకాశాలు కోసం వెళ్లగా తమిళ సినిమా పరిశ్రమ ఆమెను ఆదరించి స్టార్ హీరోయిన్ గా చేసింది. అక్కడ స్టార్ అయిన తర్వాత తెలుగులో నటించడం మొదలు పెట్టింది అంజలి. ఇక శ్రీ విష్ణు హీరోగా నటించిన రాజా రాజా చోర సినిమాలో హీరోయిన్ గా నటించిన సునైనా తెలుగులో అంతకుముందు కొన్ని సినిమాల్లో నటించిన పెద్దగా ఎలివేట్ కాలేదు. దాంతో తమిళనాడులో పలు చిత్రాల్లో నటించి క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

 మళ్ళీ తిరిగి తెలుగు సినిమాలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమిళ సినిమాల్లో బిజీగా మారిపోయిన తెలుగు హీరోయిన్ శ్రీవిద్య. తమిళంలో సినిమాలు చేయకముందు టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో చేసి స్టార్ హీరోయిన్ అయ్యే విధంగా ప్రయత్నాలు చేసినా కూడా కుదరలేదు. తమిళంలో మంచి మంచి అవకాశాలతో అక్కడ పాపులారిటీ దక్కించుకొని ఇప్పుడు తెలుగులో కూడా భారీ చిత్రాలు చేస్తుంది. ఇటీవలే శ్రీదేవి సోడా సెంటర్ ఈ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో కనువిందు చేసిన ఆనంది తమిళంలో మంచి పాపులారిటీ దక్కించుకున్న తర్వాతే తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి. వీరే కాకుండా స్వాతి, బిందు మాధవి, రీతు వర్మ కూడా తెలుగులో కలిసిరాక తమిళంలో పలు సినిమాలతో క్రేజ్ దక్కించుకుని తెలుగులో వరుస అవకాశాలు కొట్టేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: