సినీ ఇండస్ట్రీలోకి హీరో గా రాణించాలంటే.. కలర్, పర్సనాలిటీ ముఖ్యం కాదని.. కష్టం క్రమశిక్షణ ఈ రెండు ఉంటే చాలు హీరోగా రాణించొచ్చు అని నిరూపించాడు స్టార్ హీరో ధనుష్.. తను ప్రేక్షకులను ఆకర్షించే అందం కాకపోయినప్పటికీ తనదైన శైలితో కోట్లాది మంది అభిమానులను సంపాదించాడు హీరో ధనుష్. తనకి నటనపై ఇష్టం లేకున్నప్పటికీ తన తండ్రి కస్తూరి రాజా కోరిక మేరకే తన సినీ ఇండస్ట్రీలో బలవంతంగా వచ్చాడు.


అలా అయిష్టంగానే సినిమాలలొకి వచ్చిన ధనుష్ ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇక ప్రస్తుతం ఈయన రెమ్యూనరేషన్, ఈయన స్థిరాస్తుల వివరాల గురించి ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే ఈ హీరో కి ఎంత ఆస్తి ఉంది, ఎంత రెమ్యూనరేషన్ పుచ్చుకుంటాడో ఇప్పుడు చూద్దాం.


ధనుష్ ఒక్కో సినిమాకి దాదాపుగా 15 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ఇక శేఖర్ కమ్ముల తో ఒక సినిమాలో నటించేందుకు.. ఏషియన్ సంస్థతో ధనుష్ 50 కోట్ల రూపాయల వరకు పారితోషికం అందుకున్న ఉన్నట్లు సమాచారం. ఇక ధనుష్ ఆస్తి విషయానికి వస్తే.. ఈ యువ హీరో దగ్గర ఆరు ఖరీదైన కార్లు ఉన్నాయట. అందులో ఒకటి నాలుగు కోట్ల రూపాయల వరకు ఉండను ఉన్నట్లు సమాచారం. ఇక ఈ హీరో మొత్తం ఆస్తి విలువ.. దాదాపుగా 200 కోట్ల రూపాయలు విలువ చేస్తున్నట్లుగా సమాచారం.

ప్రస్తుతం తనుష్ తమిళంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ హీరో అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. ఈయన తండ్రి ఒక నిర్మాత దర్శకుడు కూడా. హీరో ధనుష్ మొదటిసారిగా రఘువరన్ బీటెక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి బాగా దగ్గరయ్యాడు అని చెప్పవచ్చు. ఇక అంతే కాకుండా కొలవెరి సాంగ్ తో.. యావత్ ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అంతే కాకుండా ఈయన రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ను వివాహం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: