టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా లో ఎంతగానో ఆకట్టుకుని ఆ తర్వాత ఆ ఇమేజ్ తో పెళ్లిచూపులు అనే సినిమా చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా ప్రేక్షకుల కళ్ళ లో పడ్డాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ను సురేష్ ప్రొడక్షన్స్ వారు విడుదల చేయగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది.
విజయ్ దేవరకొండ ఎవరి కుర్రాడు అనిపించేలా ఆ సినిమాల్లో నటించి ప్రేక్షకులను తన నటనతో ముగ్ధుల్ని చేశాడు. ఇక ఆ సినిమాతో సంపాదించిన క్రేజ్ తో అర్జున్ రెడ్డి సినిమా చేయగా ఆ సినిమాతో చరిత్ర సృష్టించే హిట్ ను అందుకున్నాడు విజయ్. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ అని చెప్పాలి. ఈ సినిమాలో ఆయన నటించిన తీరుకు సినిమా కాన్సెప్ట్ కు సరిగ్గా సూట్ అవడంతో ఈ సినిమా ఈ రేంజ్ లో హిట్ అవగలిగింది.
ఇక తనకు వచ్చిన స్టార్ డమ్ ను నిలబెట్టుకునే విధంగా విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా చేయడం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలోనే ఆయన గీతా ఆర్ట్స్ సంస్థ లో పరశురామ్ హీరోగా గీతా గోవిందం అనే సినిమా చేయగా ఆ చిత్రం క్లాస్ హిట్ ను అందించింది. అలా విజయ్ దేవరకొండ ను స్టార్ హీరోగా కొనసాగేలా చేసింది ఆ చిత్రం. అలాగే ఆ చిత్రం తర్వాత చేసిన డియర్ కామ్రేడ్, టాక్సీవాలా చిత్రాలు కూడా ప్రేక్షకులను బాగానే మెప్పించడం తో విజయ్ దేవరకొండ కెరియర్ కు అడ్డులేకుండా పోయింది. ప్రస్తుతం ఆయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా చేస్తున్న లైగర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతు ఉండగా ఈ సినిమాతో ఈ యంగ్ హీరో ఏ రేంజ్ కు వెళతాడు చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి