అక్కినేని నాగ చైతన్య తన తమ్ముడి కోసం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నిన్న హాజరై న విషయం తెలిసిందే. అక్టోబర్ 15వ తారీఖున దసరా సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ను ఏర్పాటు చేయగా దానికి ముఖ్య అతిథిగా అక్కినేని నాగ చైతన్య విచ్చేశాడు. 

తమ్ముడి కోసం అన్నీ కాదని అల్ ది బెస్ట్ చెప్పడానికి వచ్చిన నాగ చైతన్య స్పీచ్ కూడా ఎంతో సింపుల్ గా ఎలాంటి కాంట్రవర్సీ లేకుం డా ఉంది. సినిమా గురించి పలు విశేషా లు చెప్పాడు. అలాగే ఈ సినిమాకు నిర్మాతగా ఉన్న వాసు వర్మ నాగచైతన్య తొలి సినిమా జోష్ దర్శకుడు కాగా దాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆయన నిర్మాతగా కలవడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పాడు.  ఆలాగే బొమ్మరిల్లు భాస్కర్ కథలు ఎంత బాగా రాస్తారో, ఎంత బాగా హ్యాండిల్ చేస్తారో అన్న విషయం తెలిపారు. అల్లు అరవింద్ సినిమాల ఎంపిక గురించి ప్రత్యేకంగా చెప్పారు.

అలాగే తమ్ముడు అక్కినేని అఖిల్ గురించి కూడా చాలా బాగా చెప్పారు. అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే స్పీచ్ ప్రారంభంలోనే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసి తెలివిగా తప్పించుకున్నాడు. యాంకర్ సుమ మైక్ ఇవ్వగానే పరిస్థితులు మారుతున్నాయి, మనుషులు మారిపోతున్నారు కానీ అక్కినేని అభిమానులు మాత్రం అదే ఎనర్జిటిక్గా ఉన్నారు అని అన్నారు. ఇక్కడ మారుతున్న మనుషులు ఎవరు అని అభిమానులు అడుగుతున్నారు. సమంత ను ఉద్దేశించి చైతు అన్నాడనే అనే అనుమానాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్పీచ్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: