సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి ఒక్కోసారి చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి.అది దర్శక నిర్మాతల విషయంలో కావచ్చు.. లేక నటీ నటుల విషయంలో కావచ్చు.ముఖ్యంగా తమ అభిమాన నటి నటుల కోసం అభిమానులు బెదిరింపు కాల్స్ చేస్తుంటారు.ఇప్పటికే ఇండ్రస్ట్రీకి చెందిన ఎంతోమంది సినీ ప్రముఖులు ఇటువంటి బెదిరింపు కాల్స్ ని ఎదుర్కోవడం జరిగింది.ఈ నేపథ్యంలోనే మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కి కూడా ఇలాంటి చేదు అనుభవం ఒకటి జరిగింది.ఇక ఆ వివరాల్లోకి వెళ్తే..2010 వ సంవత్సరం లో మహేష్ బాబు హీరోగా ఖలేజా అనే సినిమాని త్రివిక్రమ్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో మహేష్ సరసన అనుష్క హీరోయిన్ గా నటించింది.ఇక ఈ సినిమా గురించి విడుదలకు ముందే అభిమానులకి తెలిసింది.దీంతో ఈ సినిమాను ఎలాగైనా మహేష్ బాబు పుట్టినరోజు వరకు పూర్తి చేయాలని..లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయట.దీంతో మహేష్ బాబు వల్ల త్రివిక్రమ్ కి ఆయన ఫ్యాన్స్ నుండి బెదిరింపు కాల్స్ రావడంతో..త్రివిక్రమ్ ఆ విషయాన్ని కామెడీగా తీసుకున్నాడని,ఆ కాల్స్ ని పక్కన పెట్టేసాడని తెలిసింది.అయితే ఇదంతా గతంలో జరగగా.. మళ్ళీ తాను సినిమా తీసే హీరోల అభిమానుల నుండి ఇలాంటివి ఎదుర్కోవద్దన్న ఉద్దేశ్యం తోనే త్రివిక్రమ్ శ్రీనివాస్..

 తన సినిమాలను ముందుగానే పక్కాగా ప్లాన్ చేసుకుంటారు.ఇది కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయంలోనే కాదు.. చాలామంది దర్శకులు,హీరోల విషయంలో కూడా జరిగింది..ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మహేష్ బాబుతో మరోసారి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.గతంలో వీరి కలయికలో అతడు, ఖలేజా వంటి సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు మూడవ సారి వీరి కాంబో సెట్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక మరికొన్ని రోజుల్లోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో మహేష్ బాబు కి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: