మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాడో మన అందరికీ తెలిసిందే, ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాను చకచకా పూర్తి చేస్తున్నాడు, ఈ సినిమాలో చిరంజీవి కి జంటగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలా గే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు, ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  కు జంటగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడుతూ వచ్చింది, ఎట్టకేలకు ఈ సినిమాను ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది.

ఇలా ఆచార్య సినిమాను చక చక పూర్తి చేసి అనుకున్న తేదీ కి విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్న చిరంజీవి, ఈ సిని మా తో పాటు మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు తెలుగు  రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాను కూడా చిరంజీవి శరవేగంగా పూర్తి చేస్తున్నాడు ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. చిరంజీవి చేతి కి చిన్న సర్జరీ జరిగిన కారణంగా రెండు , మూడు వారాల పాటు బ్రేక్ ను తీసుకున్నారు. ఈ మూవీ ని తక్కువ సమయంలో షూట్ చేయాలనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్ సభ్యులు ఒరిజినల్ లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో బోలా శంకర్, బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమాలో నటించేందుకు రెడీ గా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: