మా అసోసియేషన్ ఇప్పటివరకు ఎలాంటి రూల్స్ ఉన్నాయో నాకు అనవసరం. నేను వచ్చాక ఇప్పటి నుంచి అన్ని మార్చేస్తానని చెప్పుకొస్తున్నాడు మంచు విష్ణు. ఇటీవల కాలంలోనే మా అధ్యక్షుడిగా ఎన్నికై చాలా బిజీగా ఉంటున్నాడు మంచు విష్ణు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉండే పెద్దలను కలవడమే కాకుండా.. తాకి ఇష్టదైవమైన దేవుళ్ళను కూడా దర్శించుకున్నాడు.

ఇక మా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. ఇటు రాజకీయవేత్తల, సినీ ఇండస్ట్రీ లో ఉండి పెద్దలను కలవడం జరుగుతూనే ఉంది. ఇక కొద్ది గంటల ముందే తన ప్యానల్ సభ్యులందరితో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి దర్శించుకున్నాడు మంచు విష్ణు. ఇక అంతే కాకుండా మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. మంచు విష్ణు చెప్పిన మాటలు విన్న తర్వాత.. మా అసోసియేషన్ ఇప్పుడు ఎంత వేడిగా ఉందో అందరికీ స్పష్టంగా అర్థం అవుతోంది.

మా లో  కొన్ని బైలాస్ మార్పు అనేది చేయడం చాలా అవసరం అని చెప్పుకొచ్చారు విష్ణు. అందుచేతనే కొంతమంది పెద్దలతో చర్చిస్తున్నామని తర్వాత ఈ విషయాలను తెలియజేస్తాం అని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఎవరు పడితే వారు మా సభ్యత్వం పొందకుండా దానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశాడు. ఇక తాజాగా ప్రకాష్ రాజ్ ఎన్నికల అధికారిని కలిసి... అక్కడ ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్ లో చెక్ చేసినట్లుగా సమాచారం.

ఈ విషయంపై మంచు విష్ణు అందులోకి మూడో వ్యక్తి ప్రవేశించ లేరు అని చెప్పుకొచ్చాడు. కానీ ఎన్నికల అనంతరం ఈ విషయాలు బాగా వినిపిస్తున్నాయని మంచి వేసిన చెప్పుకొస్తున్నాడు. ఎన్నికలలో ఏదో అవకతవకలు జరిగాయని ప్రకాష్రాజ్ చెప్పడంతో.. మంచు విష్ణు ఆ రోజున రాత్రి చాలా పొద్దుపోయింది అందుకోసమే తిరిగి మరుసటి రోజున కౌంటింగ్ కొనసాగించామని చెప్పుకొచ్చాడు. ప్రకాష్ రాజ్ అక్కడ ఉన్నటువంటి సీసీ టీవీ ఫుటేజ్ అడగడం అది మా హక్కు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఆ విషయంలో ఎలాంటి తప్పు లేదని విష్ణు తెలుపుకువచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: