యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ రేంజ్ , క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలోనే ఉంది. ప్ర‌భాస్ అనే హీరో ఇప్పుడు తెలుగు సినిమా రేంజ్ ను , మార్కెట్ ను ఎప్పుడో దాటేశాడ‌ని బాలీవుడ్ ఎన‌లిస్టులు సైతం చెపుతున్నారు. ముఖ్యంగా బాహుబ‌లి సీరిస్ సినిమా ల త‌ర్వాత ప్ర‌భాస్ మార్కెట్ క‌నీసం రు. 400 కోట్ల పై మాటే. సాహో సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ క పోయినా కూడా బాలీవుడ్ లో బంప‌ర్ హిట్ అయ్యింది.

ఇక ఇప్పుడు ప్ర‌భాస్ వ‌రుస పెట్టి పాన్ ఇండియా రేంజ్ సినిమాలే చేస్తున్నాడు. వీటిల్లో ముందు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా వ‌స్తోంది. యూవీ క్రియేషన్స్- టి సిరీస్ సంయుక్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. ఈ సినిమా 1975 బ్యాక్ డ్రాప్ లో యూరప్ నేపథ్యంలో సాగే పీరియాడిక్ క‌థాంశం తో తెర‌కెక్కింద‌ని తెలుస్తోంది. ఈ సినిమా లో క‌ళ్లు చెదిరే సుంద‌ర మైన ల‌వ్ స్టోరీ ఉంటుంద‌ని చెపుతోంది.

సినిమా కోసం యూర‌ప్ లో అంద‌మైన లొకేష‌న్ల న‌డుమ చాలా ఖ‌ర్చుతో భారీ సెట్లు వేశారు. ఇక ఈ సినిమా గురించి ఓ టాప్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. రాధే శ్యామ్ లో క్లైమాక్స్ కోసమే రు. 50 కోట్లు వెచ్చిస్తున్నార‌ట. దాదాపు 15 నిమిషాల పాటు భారీ ఎత్తున ఈ క్లైమాక్స్ ఉంటుందని సినిమా యూనిట్ వ‌ర్గాల ద్వారా స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇక మ‌గ‌ధీర రేంజ్ లో ఈ సినిమా ప్లాస్ బ్యాక్ ఉంటుంద‌ని చెపుతున్నారు. ఎమోష‌న‌ల్ గా కూడా సినిమా అదిరిపోయేలా వ‌చ్చింద‌ని అంటున్నారు.

రాధే శ్యామ్ సినిమాలో  ప్రభాస్ కి జోడీగా పూజాహెగ్డే నాయిక గా న‌టిస్తోంది. ఇంకా సీనియర్ నటుడు కృష్ణంరాజు పరమహంస పాత్రలో నటించ‌గా...  సచిన్ కేద్కర్ - అల‌నాటి అందాల న‌టి భాగ్యశ్రీ - మురళీ శర్మ - ప్రియ దర్శి లాంటి ప్రతిభావంతులు కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: