కేవలం సినిమాలతోనే కాకుండా టాక్ షోలతో కూడా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా'. 100% తెలుగు కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పిస్తూ నంబర్ వన్ ఓటీటీ సంస్థ గా పేరు తెచ్చుకుంది ఆహా. ఇక ఇతర భాషల్లో మంచి విజయాలను అందుకున్న సినిమాలను కూడా తెలుగులో డబ్ చేసి ప్రేక్షకులకు అందిస్తూ ముందుకు సాగుతోంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక సరికొత్త ట్విస్ట్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా 'అన్ స్టాపబుల్' అనే టాక్ షోను ఆహా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

అల్లు అరవింద్ ఈ టాప్ షోనీ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులను మొదలు పెట్టేశారు నిర్వాహకులు. ఇక ఇటీవలే ఈ షో ప్రారంభోత్సవ వేడుక కూడా ఘనంగా జరిగింది. ఇక బాలయ్య మొదటిసారి ఒక టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరించడంతో.. ఇటు అభిమానులతో పాటు.. అటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇక బాలకృష్ణ చేస్తున్న మొట్టమొదటి షో ఇదే కావడం విశేషం. ఇక ఇదిలా ఉంటే నవంబర్ 4వ తేదీ దీపావళి కానుకగా ఈ టాక్ షో కు సంబంధించిన మొదటి ఎపిసోడ్ ప్రసారం కానుంది. అయితే మొదటి ఎపిసోడ్ కి వచ్చే ఫస్ట్ గెస్ట్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.ఆయన మరెవరో కాదుడైలాగ్ కింగ్ మోహన్ బాబు. బాలకృష్ణ మోహన్ బాబు ఎంత సన్నిహితంగా ఉంటారో తెలిసిందే.

ఆప్యాయంగా సోదర అంటూ పిలుచుకుంటుంటారు ఈ ఇద్దరు. ఈ నేపథ్యంలోనే బాలయ్య టాక్ షో కి మొదటి గెస్ట్ గా మోహన్ బాబు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక బాలయ్య మోహన్ బాబు ని ఈ షో లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? దానికి మోహన్ బాబు ఇలాంటి సమాధానాలు చెబుతారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ టాక్ షోలో మోహన్ బాబు ఒక్కరే పాల్గొంటారా లేక అతని కొడుకులైన మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా పాల్గొంటారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక ఈ షోలో మొత్తం 12 ఎపిసోడ్లు ఉండబోతున్న ట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్క ఎపిసోడ్ కి ఒక సెలబ్రిటీ గెస్ట్ గా హాజరై బాలయ్య తో కలిసి  చక్కటి వినోదాన్ని పంచబోతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: