గడిచిన కొంత కాలంగా మల్టీ స్టారర్ సినిమాల పట్ల ఫిల్మ్ మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుస్తుంది.. కొంత కాలంగా టాలీవుడ్, కోలీవుడ్ అలాగే మాలీవుడ్, చివరకు బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని సినిమా పరిశ్రమల్లో ఈ ట్రెండ్ కొనసాగుతుందని తెలుస్తుంది.

ఇద్దరు ముగ్గురు టాప్ హీరోలను ఒకే సినిమాలో నటింపజేయడం మూలంగా సినిమా మంచి విజయం అందుకుంటుంది అనేది ఆయా దర్శకనిర్మాతల ఆలోచనని తెలుస్తుంది.అది కొంత మేరకు వాస్తవం అని తెలుస్తుంది.అయితే చాలా వరకు మల్టీస్టారర్ సినిమాలు అపజయాలను మూటగట్టుకున్న సందర్భాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది .

వాస్తవానికి మల్టీ స్టారర్ సినిమాలు అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేవని దానికి చాలా కారణాలున్నాయని సమాచారం.కర్ణుడి చావుకు అనేక కారణాలు అన్నట్లు మల్టీ స్టారర్ సినిమాల పరాజయాలకు కూడా చాలా కారణాలు ఉంటాయని తెలుస్తుంది.. ఒకే సినిమాలో కలిసి నటించే ఇద్దరు హీరోల మధ్య కూడా శైలిలో చాలా వ్యత్యాసం ఉంటుందని అందుకే దర్శకులు ఈ సినిమాల్లో చాలా అంశాలను జోడించాల్సి ఉంటుందని అటు సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న తోపు హీరోల ఆధిపత్యం కూడా ఎక్కువగానే కనిపిస్తుందని సమాచారం. కథ వాళ్లకు నచ్చినట్లే ఉండాలనే కండీషన్లు పెడతారని అటు పెద్ద దర్శకుల పైత్యం కూడా ఈ సినిమాలు పరాజయం పొందడానికి కారణం అవుతాయని తెలుస్తుంది.

  నిజానికి కొందరు కమర్షియల్ గా ఆలోచించి మల్టీ స్టారర్ సినిమాలు తెరకెక్కిస్తారని అటు జనాలు కూడా మల్టీ స్టారర్ అనగానే సినిమాపై చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుంటారని తెలుస్తుంది.. ఆ విపరీతమైన అంచనాలు కూడా సినిమాను ఒక్కోసారి దెబ్బతీసే అవకాశం ఉంటుందని సమాచారం. గతంలో ఓసారి బాలయ్య సుల్తాన్ అనే సినిమా చేశాడని అందరికి తెలుసు.ఇది ఓ మల్టీస్టారర్ మూవీ అయినా కూడా పెద్దగా జనాదరణ దక్కించుకోలేదని తెలుస్తుంది.మళ్లీ ఆ తర్వాత మరిన్ని అంచనాలతో జనాల ముందుకు రాబోతుంది ఆర్. ఆర్.ఆర్ సినిమా. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయని తెలుస్తుంది.దర్శకుడు రాజమౌళి కావడంతో మాములూగానే ఆ స్థాయి హైప్ ఉంటుందని సమాచారం . అయితే సినిమా ఏమాత్రం అటు ఇటు అయినా కూడా తలకిందులయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR