దాదాపు అన్ని చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ ఉండటం రొటీన్ అయిపోయింది. సినిమా అంటే మంచి కామెడీ, ఎమోషన్స్ ఫైట్స్ ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో, అదే తరహాలో స్పెషల్ సాంగ్స్ కూడా ఉండాలని కోరుకుంటున్నారు ఎక్కువ మంది ప్రేక్షకులు. దాంతో స్పెషల్ సాంగ్స్ కు ఆదరణ పెరిగింది. గతంలో కంటే ఇప్పడు స్పెషల్ సాంగ్స్ మరింత స్పెషల్ గా ముస్తాబు అయి వస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఐటెం సాంగ్స్ అంటే కొందరు నటీనటులు మాత్రమే స్పెషల్ గా చేస్తుండగా..ఇపుడు ట్రెండ్ మారింది క్రేజీ హీరోయిన్స్ తో స్పెషల్ సాంగ్స్ చేయిస్తూ...ఆ సాంగ్స్ లెవల్ ఓ రేంజ్ లో పెంచేస్తూ అదే లైన్ లో సినిమాపై అంచనాలు కూడా పెంచే పనిలో పడ్డారు దర్శక నిర్మాతలు. అందుకే కోట్లు ఇచ్చినా సరే స్పెషల్ సాంగ్స్ కు స్టార్ హీరోయిన్లను ఎంపిక చేసుకుంటున్నారు.

ఏదేమైనా స్పెషల్ సాంగ్స్ లో స్టార్ హీరోయిన్ కనిపిస్తే ఆ కిక్కే వేరు. ఇక అల్లు అరవింద్ నిర్మాణంలో బోయపాటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం "సరైనోడు" సూపర్ హిట్ ను అందుకుంది. అల్లు అర్జున్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ చిత్రం 2016, ఏప్రిల్ 22 సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ అయి సంచలనం సృష్టించింది. ఆది, క్యాథరిన్ థ్రెసా లు ముఖ్య భూమికలు పోషించారు. మాస్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బోయపాటి కొత్త సినిమాలో స్పెషల్ సాంగ్ ని కూడా అంతే మాస్ గా ఉండేలా డిజైన్ చేసుకున్నాడు.

అందులోనూ ఆ సాంగ్ కి స్టార్ హీరోయిన్ అంజలిని ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు. హీరోయిన్ అంజలి అనగానే తెలుగుదనానికి పరికిణీ వేసినట్టుగా ఉంటుంది, ఆమె చేసిన పాత్రలు కూడా అంతే అందంగా తెలుగుదనాన్ని ఉట్టి పడేలా చేస్తాయి. అలాంటిది ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం అంజలి వేసిన ఊర మాస్ స్టెప్పులు ప్రేక్షకులకు షాక్ ఇవ్వడమే కాదు టాలీవుడ్ నే షేక్ చేశాయి.  "చిలకలూరి చింతామణి"..అంటూ ఈ పాట ప్రేక్షకులతో విజిల్స్ వేయించింది.  ఈ సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: