సినిమా అనే రంగుల ప్రపంచంలో రాణించాలి అంటే ఎంత టాలెంట్ వున్న ప్పటికీ కాస్త అదృష్టం కూడా కావాలి అన్న విషయం తెలిసిందే. ఇక అదృష్టం ఉంటే టాలెంట్ కాస్త తక్కువ ఉన్నా కూడా సినిమా ఇండస్ట్రీలో రాణించడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో   హీరోగా పరిచయం అయిన వారు స్టార్ హీరో గా మారాలి అంటే కేవలం ఒకే ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారి పోతూ ఉంటారు నటులు. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల గా కొనసాగుతున్న వారు కూడా ఒకే ఒక్క సినిమాతో కూడా క్రేజ్ సంపాదించిన వారు ఉన్నారు.


 అలాంటి వారిలో ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ కూడా ఒకరు. కృష్ణంరాజు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. రాఘవేంద్ర అనే సినిమాతో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఇక వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నప్పటికీ అంతగా క్రేజ్ మాత్రం సంపాదించుకోలేక పోయాడు. కానీ ఆ తర్వాత వర్షం సినిమా తో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు ప్రభాస్. ఇక తన కెరీర్ లో మొదటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాడు.


 శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎమ్మెస్ రాజు నిర్మించారు  అయితే ముందుగా ఈ కథప్రభాస్ తో సినిమా చేయాలని అనుకోలేదట. మహేష్ బాబు తో సినిమా చేయాలనీ ప్లాన్ చేశారట.ఇక మహేష్ దగ్గరికి వెళ్లి కథ కూడా వినిపించారట దర్శకుడు శోభన్. అయితే అప్పటికే శోభన్ మహేష్ బాబుతో బాబు సినిమా తీయగా సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఇక  మళ్లీ అదే డైరెక్టర్ తో సినిమా అనేసరికి  కాస్త వెనకడుగు వేశాడట మహేష్ బాబు. ఇక అదే సమయంలో మహేష్ బాబుకు ఒక్కడు అనే సినిమా కూడా ఒకే కావడంతో ఇక మహేష్ బాబు ని కాదని ప్రభాస్ దగ్గరికి ఈ కథ వినిపించడానికి వెళ్లగా.. ప్రభాస్ ఓకే చేశాడట. ఇలా ప్రభాస్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి ప్రభాస్కి ఒక్కసారిగా మాస్ ఫాలోయింగ్ ని తెచ్చి పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: