అయితే ఇప్పుడు నానీకి అక్క గా అనుష్క నటించే అవకాశం ఉండవచ్చని సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నానీ సినిమా చేస్తే మాత్రం అందులో నానీ కి అనుష్క అక్క గా కనపడే అవకాశం ఉందని దీనికి సంబంధించి త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్లారని సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఒక సినిమాకు సూచనలు సలహాలు ఇస్తూ ఆ సినిమాతో బిజీగా ఉన్నారు. నానీతో సినిమాను మొదలు పెట్టి దాదాపుగా మూడు నెలల్లో పూర్తి చేసి ఆ సినిమాను విడుదల చేసే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది.
అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు అనుష్క పాత్ర విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అనుష్క కూడా తన పాత్రకు సంబంధించిన సూచనలు ఇచ్చిందని సమాచారం. మాజీ హీరోయిన్లను తన సినిమాల్లో కీలక పాత్రలు ఇచ్చే త్రివిక్రమ్ శ్రీనివాస్ అనుష్క పాత్ర విషయంలో మాత్రం ఎన్నడూ లేనివిధంగా శ్రద్ధ చూపిస్తున్నాడు అని తెలుస్తోంది. ఏది ఎలా ఉన్నా సరే అనుష్క మాత్రం నాని కి అక్క గా నటిస్తుంది అనే వార్త రావడం నానీ అభిమానులకు అలాగే అనుష్క అభిమానులకు జోష్ ఇచ్చే వార్తగా చెప్పాలి.