బిగ్ బాస్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి ఈ విషయం అర్ధమైపోయి ఉంటాది. మరో మూడు వారల్లో ముగియనున్న బిగ్ బాస్ సీజన్ 5 లో మాహానటులు ఉన్నట్లు తెలుస్తుంది. ఫైనల్స్ డేట్ దగ్గరపడుతుండడంతో హౌస్ లోని కంటెస్టెంట్స్ జోరు పెంచారు. ఎలాగైన టైటిల్ కొట్టడానికి బాగా కష్టపడుతున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం టికెట్ టూ ఫినేలే కు సంబంధించి బిగ్ బాస్ కొన్ని టాస్క్ లు ఇస్తున్నారు. ఈ టాస్క్ ల్లో ఎవరైతే ఎక్కువ పాయింట్లు గెలుచుకుంటారో వాళ్లే ఆ టికెట్ టూ ఫినాలే ను గెలుచుకుని డైరెక్ట్ గా ఫైనల్స్ కి చేరుకుంటారు.

టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఐస్‌ క్యూబ్స్‌పై నిల్చొని పక్కవారి బుట్టలో బాల్స్ ను లాక్కుని మన బుట్టలో వేసుకొవచ్చు. అలాగే మన దగ్గర ఉన్న బాల్స్ ఎవరు తీసుకోకుండా చూసుకోవాలి. ఇక ఈ గేమ్‌లో సిరి, సన్నీ  మధ్య మళ్లీ పెద్ద యుద్దమే జరిగింది. సిరి సన్నీ బాల్స్ ని లాకునే క్రమంలో సన్నీ బాల్స్ అన్నీ క్రింద పడిపోయాయి. దీంతో ఫైర్  అయిన సన్నీ ఇక నా ఆట చూపిస్తా అంటూ గట్టిగా అరుస్తారు. ఇక సిరి బాల్స్ ని గేమ్‌ లో భాగంగ సన్నీ కిందపడేస్తాడు. ఇలా వీళ్ల మధ్య నడిచిన ఫైట్‌ లో సడెన్ గా రవి అంటూ షణ్ముఖ్ గట్టిగా అరుస్తాడు.

ఇక ఆ వెంటనే సిరి కూడా గట్టిగా రవి అంటూ అరుస్తుంది. దీంతో హౌస్ మేట్స్ ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు వీళ్లు రవి అంటూ పిలవడం ఏంటి అని మండిపడతారు. ఎందుకు రవి అంటూ అరిచారో తెలియక కాజల్, సన్నీ, మానస్ దీని గురించి చర్చించుకుంటారు. ఇక సిరి-షణ్ముఖ్ హౌస్ లో రవి అని అరిచింది ఇందుకే అంటూ బయట ఉన్న అభిమానులు క్లారిటీకి వచ్చేసారు. హౌస్ నుండి బయటకు వెళ్లిపోయిన రవి..హౌస్ లో ఉన్న షణ్ముఖ్-సిరి కి ఓట్లు వేయించడానికే ఇలా వీళ్లు కావాలనే అరిచి సన్నీ ని బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారంటూ ఫిక్స్ అయిపోయారు. కానీ ఎవరు ఏం ప్లాన్ ను వేసినా ఈ సీజన్ విన్నర్ సన్నీ నే అంటున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: