సూపర్ స్టార్ రజనీ కాంత్ ఇటీవలే అన్నాథే సినిమా తో తమిళ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండు వందల నలభై కోట్లకు పైగా వసూళ్ల ను సాధించి బ్లాక్ బస్టర్ విజయం గా నిలిచింది, ఈ సినిమాను  దర్శకుడు శివ సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కించాడు.  చెల్లి కోసం ఏదైనా చేసే అన్నా, ఆ చెల్లె ఒక ప్రేమించిన అబ్బాయి తో వెళ్ళి పోవడం వల్ల ఆ అమ్మాయికి కలిగిన కష్టాలను ఆ అమ్మాయి కే తెలియకుండా తీర్చే అన్న పాత్ర లో రజనీకాంత్ నటించాడు.

ఇలా ఒక రోటీన్ కథల సాగిన ఈ సినిమా సూపర్ స్టార్ ఇమేజ్ తో తమిళ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కాక పోతే టాలీవుడ్ లో మాత్రం ఈ రొటీన్ కథ కు పెద్దగా ఆదరణ లభించలేదు. ఈ సినిమా తెలుగు లో పెద్దన్న పేరు తో విడుదల అయ్యింది. తమిళం లో మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం గా నిలిచి రజనీ కాంత్ కు ఎన్నో రోజుల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని అందించింది.  ఈ సంతోషాన్ని ఈ సినిమా దర్శకుడు శివ తో రజనీ కాంత్ పంచుకున్నారు. అందుకోసం సూపర్ స్టార్ రజినీకాంత్ నేరు గా శివ ఇంటికి వెళ్లారు. చెన్నై అన్నానగర్ లోని శివ ఇంటి కుటుంబ సభ్యులతో రజినీ కాంత్ దాదాపు 3 గంటలు సమయం గడిపారు. రజనీ కాంత్ దర్శకుడు శివ ఇంటికి వెళ్లడం మాత్రమే కాకుండా దర్శకుడు శివ కు ఒక గోల్డ్ చైన్ లు కూడా బహూకరించాడు. ఇలా రజనీ కాంత్ తనకు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన దర్శకుడు శివ ను గోల్డ్ చైన్ తో బహూకరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: