ఈమూవీకి ఏర్పడిన మ్యానియా రీత్యా తెలుగు రాష్ట్రాలలో ఆదివారం వరకు చాలచోట్ల టిక్కెట్లు ముందుగా బుక్ అయ్యాయి కాబట్టి అసలు విషయం వచ్చే సోమవారంనాడు మాత్రమే ఈమూవీ అసలైన రిజల్ట్ బయటకు వస్తుంది. ఈమూవీ కథలో కొత్తదనం లేదు. దీనికితోడు ఈమూవీ నిడివి మూడు గంటలు ఉండటం కూడ ఈమూవీకి మైనస్ గా మారుతుందని ఈమూవీలో అద్భుతమైన బన్నీ యాక్షన్ పాటలు మినహా చెప్పుకోతగ్గ మరే విషయాలు లేవు అంటూ ఈమూవీని చూసిన సగటు ప్రేక్షకుడు తీర్పు ఇస్తున్నాడు.
అయితే ఇలాంటి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ‘అఖండ’ కలక్షన్స్ విషయంలో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ దుమ్ము దులిపింది. దీనితో అలాంటి రిజల్ట్ ‘పుష్ప’ వస్తుందా లేదా అన్నది మరొక మూడు రోజులు ఆగితే కాని తెలియదు. ఈ పరిస్థితుల మధ్య ఈమూవీ విడుదలకు ముందు ఒక మీడియా సమావేశంలో బన్నీ చేసిన ప్రతిజ్ఞ ను అతడికి గుర్తు చేస్తూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘పుష్ప’ మరికొన్ని గంటలలో విడుదల అవుతుంది అనగా మైత్రీ మూవీస్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అల్లు అర్జున్ ఎవరు ఊహించని ఒక షాకింగ్ కామెంట్ చేసాడు.
‘పుష్ప’ విడుదల తరువాత ఒక అద్భుతమైన కమర్షియల్ సినిమాని ఎవరైనా ఎలా తీయాలి అని భావించినప్పుడు ఆదర్శకుడు ఎంత గొప్పవాడు అయినప్పటికీ సుకుమార్ తీసిన ‘పుష్ప’ ఘనవిజయం తరువాత ఒక కమర్షియల్ సినిమా ఎలా తీయాలి అన్న విషయం సుకుమార్ ను అడిగి సలహాలు తీసుకుంటాడని కామెంట్స్ చేసాడు. భవిష్యత్ లో అలాంటి పరిణామం జరగకపోతే తాను షర్ట్ విప్పి మైత్రీ మూవీస్ ఆఫీస్ ఎదుట కూర్చుంటాను అంటూ భీష్మప్రతిజ్ఞ చేసాడు బన్నీ. అయితే బన్నీ ప్రతిజ్ఞ ఏమౌతుందో చూడాలి అంటూ కొందరు జోక్ చేస్తున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి