ఒక సంవత్సరం మొత్తం ఎంతో హాయిగా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఉంటారు. అయితే అందరికీ ఎంతో స్పెషల్ అయిన డిసెంబర్ 31 ఇంకా మరింత స్పెషల్ గా మార్చేందుకు ఈటీవీ నిర్వాహకులు కొత్త ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇక ఈ కొత్త ఈవెంట్ కి పెళ్ళాం వద్దు పార్టీ ముద్దు అంటూ ఒక టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.. ఇక ఇప్పటికే ఈ షో కి సంబంధించి ఒక ప్రోమో విడుదల అయ్యింది. ప్రోమో ఈ షో పై మరింత అంచనాలు పెంచేసింది. ఇటీవలే మరో ప్రోమో కూడా విడుదలైంది.
ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ ప్రోమోలో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ అందరు కూడా స్పెషల్ స్కిట్స్ చేశారు. అదే సమయంలో సెన్సేషనల్ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఈ కార్యక్రమానికి రావడం గమనార్హం. వర్మ బుల్లితెర కార్యక్రమాల్లో కనిపించడం చాలా తక్కువ. కానీ ఇటీవల ఈ టీవీలో ప్రసారం కాబోయే పెళ్ళాం వద్దు పార్టీ ముద్దు అనే కార్యక్రమానికి విచ్చేశారు రాంగోపాల్ గారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్ వర్షా రాంగోపాల్ వర్మ ను పోగొడుతుంది. మీరు ఎంతో హీరోలా ఉన్నారు సార్ అంటూ చెబుతుంది. అంటే మరి ఎదవ రా కనిపిస్తున్నానా అంటూ రాంగోపాల్ వర్మ పంచ్ వేస్తాడు దీంతో అక్కడున్న వారందరూ షాక్ అవుతారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి