చాలా మంది మలయాళ హీరోయిన్లు తమ టాలెంట్ తో టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ హోదాను అందుకున్న వారున్నారు. ఉత్తర భాషా సినిమాలు ఇక్కడ డబ్ అయినప్పుడు ఆ సినిమా క్లిక్ అయితే అలా చాలా హీరోయిన్లకు తెలుగులోను ఆఫర్లు లభించాయి. ఆ విధంగా టాలీవుడ్ లో ఛాన్స్ దొరికితే చాలు అనుకునే ఇతర ఇండస్ట్రీ హీరోయిన్లు కూడా లేకపోలేదు. అయితే ఇదే తరహాలో ఓ మలయాళ హీరోయిన్ కి టాలీవుడ్ లో మంచి అవకాశం రాగా ఆమె తన చేతులారా వదులుకున్నారట. ఇంతకీ ఎవరా ఆ హీరోయిన్ ఏమిటి విషయం అంటే తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ 'రాజా రాణి' తెలుగులోను డబ్ అయి ఘన విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన నయనతార, నజ్రియా ఇరువురికి కూడా హీరోలతో పాటుగా మంచి గుర్తింపు లభించింది. నయన్ మన తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలే, అయితే మరో హీరోయిన్ గా చేసిన నజ్రియా కి కూడా ఈ సినిమాతో తెలుగులో మంచి ఆదరణ లభించింది. ఈమె నటనకు, అందానికి తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అప్పట్లో ఈమెకు డైరెక్ట్ గా తెలుగులో ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వచ్చిందట. అయితే కొన్ని కారణాల వలన ఆమె ఆ సినిమాకి సైన్ చేయలేకపోయారని టాక్ వినిపించింది.

ఒక్క సినిమాతో ఎంతో మంచి పేరును సంపాదించుకున్న నజ్రియా తర్వాతా పెద్దగా రాణించలేదు. ఈమె 2014 లో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ను వివాహం చేసుకున్నారు. కాగా అప్పట్లో ఆ అవకాశం కనుక మిస్స్ అయి ఉండకపోతే ఈమె టాలీవుడ్ లో ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ అయి ఉండేదని పలువురి అభిప్రాయం. ఈ రోజు ఈ అమ్మడు తన పుట్టినరోజును జరుపుకుంది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిద్దాం

మరింత సమాచారం తెలుసుకోండి: